పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

98 పె.అ.రేకు:0023-05 సామంతం సంపుటము: 15-133 పల్లవి: అందులోనె వున్నవాఁడు ఆదిమూరితి అందరాని పదవియైన నందిచ్చు నతఁడు చ. ఘను లిండ్ల వాకిళ్ళు కావఁ బొయ్యె జీవుఁడా కని నీ యాత్మ వాకిలి కావరాదా యొనసి పరులరాజ్య మేలఁబొయ్యే జీవుఁడా అనిశము నీ మనోరాజ్యము నేలరాదా చ. చెలుల రూపము లెల్ల చింతించే జీవుఁడా చెలఁగి నీ రూప మేదో చింత్రించ రాదా కెలన సుఖములు భోగించేటి జీవుఁడౌ పొలసి సుజ్ఞానము భోగించరాదా చ. చేవ సంసారాన బలిసిన యట్టి జీవుఁడా భావపుటానందాన బలియరాదా కోవరపు సంపదల కోరేటి జీవుఁడా శ్రీ వేంకటేశుని సేవ గోరరాదా రేకు:0236-03 ఆహిరి సంపుటము: 03-206 పల్లవి: అక్కటా నీమాయ కగపడె జీవుఁడు యొక్కువతక్కువ లివి యేమీఁ దలపోయఁడు చ. గొందినున్న స్వర్గము గోరి పుణ్యము సేయును యెంది తన వ్రాఁతఫల మెరఁగడు సందడించి మరునాఁటి చవులకే కూడపెట్టు పొంది మింగిన కళ్ళపులుసర మెంచఁడు చ. అప్పటి దేహసమ్మంధపాలికే మనసు పెట్టు తప్పిపోయినవారలఁ దగులఁడు కప్పుకొనే కోకలకే కడఁగి చేతులు చాఁచు చిప్పిలఁ దొల్లి చించివేసినవెన్నో యెంచఁడు చ. యెదిటిగృహారామాలివే తనకాణాచను చెదరి కలలోనివి చేపట్టడు వెదకు వైకుంఠపు విషుమూర్తిఁ గనేనని హృదయములో శ్రీవేంకటేశుఁ జూడనెంచఁడు రేకు:0140–04 దేసాళం సంపుటము:02-175 పల్లవి: అక్కటా నే నిర్మలుఁడనయ్యే దిఁక నెన్నఁడో చక్క నన్ను దిద్దుకోనే సర్వేశ్వరా చ. నేనే మంచివాఁడనైతే నిండుకోదా జ్ఞానము కానీలే యింకా నేమేమి గడమో కాక ఆనుక సుకృతినైతే నలవడదా విరక్తి కానరాని తప్ప లెన్నిగలవో కాక చ. నామనసే చక్కనైతే నాకుఁ బ్రత్యక్షము గావా చేముంచి నేరమేమి సేసితినో కాక ఆముక మోక్షాధికారినైతే నెదురుగా రాదా కామితార్థాలు భోగించఁగలుగఁబోలుఁ గాక చ. ఔలే నామేను పవిత్రమైతే సేవ గొనవా యేలాగున్నదో నీచిత్త మెఱఁగఁ గాక యీలీల శ్రీవేంకటేశ యెదుటనే వున్నాఁడవు యేలుకొని చేపట్టి యీడేర్చవు గాక