పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

99 పె.అ.రేకు:0046-05 భైరవి సంపుటము: 15-262 పల్లవి: అక్కటా ప్రాణికిని అహంబ్రహ్మత్వమే కాని దిక్కుదెస యైనవానిఁ దెలుసుకో నోపఁడు చ. కలలోన సృజియించుఁ గర్తయై యంతర్యామి లలి(బ్రపంచ మిOద్రజాలములవలె తలపాణియు జీవుఁడు తనకృత్యములు గావు వెలి నెందుఁ బుట్టె నని విచారించుకోఁడు చ. యెదుటనే పొడమించు యీరూపు లాత్మేశుఁడు కదిసి పురాణముల కత్రలవలె వదలక జీవుఁ డెవ్వరిని నేమించలేఁడు పదరక మూలముట్టు భావించుకోఁడు చ. కనిపించు మోక్ష మిక్కడ శ్రీవేంకటేశుఁడు పనివడి తన తపఃఫలమువలె ఘనతఁ బొందుజీవుఁడే కర్మమువాఁడుగాఁడు గొనకొన్న మహిమల గుఱు తెంచుకొనఁడు రేకు:0285-06 దేసాళం సంపుటము: 03-493 పల్లవి: అక్కటా రావణు బ్రహ్మహత్య నీకు నేడది పుక్కిటి పురాణలింగపూజ నీకు నేడది చ. గురుహత్య బ్రహ్మహత్యఁ గూడీ ద్రోణాచార్యు వంక హరి నీ కృప నరును కవిలేవాయ యెరవుగాఁ గల్లలాడి యేచిన ధర్మజునకు పరగ నీ యనుమతిఁ బాపము లేదాయను చ. అదివో రుద్రుని బ్రహ్మహత్య వాయఁ గాసి యిచ్చి పొదలిననీ వతనిఁ బూజింతువా అదనఁ బార్వతిదేవి కాతఁడే నీ మంత్రమిచ్చె వదరు మాటల మాయావచనాలేమిటికి చ. తగిలి నీ నామమే తారకబ్రహ్మమై జగము వాలి పాపాలు సంత్రతముఁ బూపుఁగాను మిగుల శ్రీవేంకటేశ మీకు నేడ పాతకాలు నగుఁబాటు లింతేకాక నానాదేశముల పె.అ.రేకు:0013-04 రామక్రియసంపుటము: 15-071 పల్లవి: అక్కటా లోకోన్నతుఁడు హరిఁజేరి యిట్లయితి యొక్కువ స్వర్గాని కెక్కి యేకులు వడుకుటా చ. హరికి మొక్కిన మొక్కు లల్పసుఖమునకు వెరవెఱుఁగక తావెచ్చ పెట్టుటా గరిమఁ గొండంతపైఁడి కలగూరకు మూఢ నరుఁడు విలువ యిచ్చి సరిఁగొనుకొనుటా చ. తలఁచే హరిమంత్రము తనభోగములకై నెలవు సేసికొని తాఁ జెనటి యవుట పలి బందివేఁట వోయి పూరేడుఁ బట్టి తెచ్చి ములుచ మానవుఁడు ముదమOదుటూ చ. శ్రీ వేంకటేశ్వరుని సేవించి యితరులచే భావించి యిప్పించుమని పనిగొనుటా కావించి కల్పవృక్షము గాడిగుంజగాఁ బాఁతి ఆవల దుర్మదదేహి అజ్ఞాని యవుటా