పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

100 రేకు:0015-02 ఆహిరి సంపుటము: 01-090 పల్లవి: అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి కుక్కనోరికళాసమై కొల్లఁబోయ బతుకు చ. ఎండచేత నీడచేత నెల్లవాఁడు నిట్గానే బండుబండై యెందుఁ గడపల గానక వుండగిలి నరకాల నుడుకబోయెద మింక వండఁ దలిగినకూరవలెనాయు బతుకు చ. పంచమహపాతకాలబాలిఁ బడి భవములఁ దెంచి తెంచి ముడివేయ దీదీపులై పొంచినయూసలవెంటఁ బొరలఁబోయెద మింక దంచనున్న రోలిపిండితలఁపాయ బతుకు చ. యీదచేత వానచేత నెల్లవాఁడు బాయని బాదచేత మేలెల్ల బట్టబయలై గాదిలివేంకటపతిఁ గానఁగఁబోయెద మింక బీదగరచినబూరెప్రియమాయ బ్రదుకు రేకు:0259-04 ధన్నాసి సంపుటము: 03-340 పల్లవి: అక్కడ నెక్కడి నరకము ఆ మాటే కల్లా దిక్కుల ని(నిం?)దె ఇన్నియుఁ దీరుచుకొంటిమయ్యా చ. తనువిది మలమూత్రంబుల(లు?) దాకొనియుండిన పట్టము దినదినమును వుచ్చిష్టపుదిడ్లఁ దూరెదము జననము నెత్తురు నెమ్ములు సారెకు నూరెడిగుంతలు మనిమని నరకము చొచ్చిన మనుజుల మిదె నేము చ. మదనజలంబుల కాలువ మాపెద్దల పూర్వంబులు(?) పొదలిన పుత్రుల యిసిళ్లపుట్టలు వెట్టెదము యెదుటనె సంసారంబులు యొడయని కారాగృహములు మదిమది నరకము చవిగొను మనుజుల మిదె నేము చ. వుట్టినదే నగ్నత్వము బూతో బండో యొరఁగము చిట్టంట్లవాచవులగు జీవుల మింగెదము నెట్టన శ్రీవేంకటేశ్వర నీతోఁ గూడఁగ జగములు మట్టినచోటే మట్టే మనుజుల మిదె నేము రేకు:0092-04 ముఖారి సంపుటము: 01-456 పల్లవి: అక్కరకొదగనియట్టియర్థము లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే చ. దండితోఁ దనకుఁ గాని ధరణిశు రాజ్యంబు యెండెనేమి యది పండెనేమిరే బెండుపడఁ గేశవునిఁ బేరుకొననినాలికె వుండెనేమి వుండకుండెనేమిరే చ. యెదిరిఁ దన్నుఁ గానని యెడపుల గుడ్డికన్ను మొదలఁ దెఱచెనేమి మూసెనేమిరే వెదకి శ్రీపతిసేవ వేడుకఁ జేయనివాఁడు చదివెనేమి చదువు చాలించెనేమిరే చ. ఆవల నెవ్వరులేని ఆడవిలోనివెన్నెల కావిరిఁ గా సెనేమి కాయకున్న నేమిరే శ్రీవేంకటేశ్వరుఁ జేరనిధర్మములెల్ల తోవల నుండెనేమి తొలఁగినేమిరే