పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

101 రేకు:0226-06 శంకరాభరణంసంపుటము: 03-149 పల్లవి: అక్కలాల చూడుఁడందరును నిక్కి వారవట్టీ నేఁడు గృష్ణుఁడు చ. ఆనవాలవుట్టి అడుకులవుట్టి పానకపుటుట్టి బలిమినే ఆనుక కోలల నందియుంది కొట్టి తేనెవుట్టి (?) గొట్టీ దేవకీసుతుఁడు చ. పెరుగువుట్టి మంచి పేరిన నేతివుట్టి సరివెన్నవుట్టి చక్కెరవుట్టి వెరవుతోఁ గొట్టి వెస బాలులతో పొరుగువుట్టి (?) గొట్టీ పొంచి రాముఁడు చ. మక్కువ నలమేలుమంగఁ గూడి నేఁడు చొక్కి శ్రీవేంకటేశుఁడు వీధుల నిక్కి వుల్లెల్లా నిండాఁ గొట్టి వుట్టి(?)చక్కిలాలు గొట్టీ జగతీశుఁడు ජීජo: 0300-05 శుద్ధవసంతం సంపుటము:03-582 పల్లవి: అక్షయంబగు మోక్ష మందుటే తగుఁగాక భక్షించు పండ్లకు బ్రాణ మీఁదగునా చ. కొండంత పసిఁడి కలగూరకె వెల యిడిన నిండిన వివేకులకు నేరమిది గాదా దండమిడి హరి నిన్ను దలఁచిన ఫలంబెల్లనండ పాపము వాపు మనుట కిది దగునా చ. గుఱుతు గల రత్నంబు గుగ్గిళ్లు గొనఁగ వెల పఱచుటే తన బుద్ధి పాడౌట గాదా అఱిముటి హరి నిన్నునర్చించు ఫలమెల్ల కఱకుఁ దన దేహభోగముల కనఁదగునా చ. కామ ధేనువు దెచ్చి కాసుకె వెలకొసగ కామించి న8)కులకు కడుఁ గోరెరత్ర గాదా శ్రీమంతుఁడై నట్టి శ్రీవేంకటేశ నిను సేమమునఁ గొలిచి తుచ్చెము లడుగఁదగునా రేకు:0290-05 రామక్రియసంపుటము: 03-522 పల్లవి: అఖిలలోకైకవంద్య హనుమంతుఁడా సీత శిఖామణి రామునికిఁ జేకొని తెచ్చితివి చ. అంభోధి లంఘించితివి హనుమంతుఁడ కుంభినీజదూతవైతి గురు హనుమంతుఁడ గంభీరప్రతాపమునఁ గడఁగితివి జంభారిచే వరములు చయ్యన నందితివి చ. అంజనీదేవికుమార హనుమంతుఁడ కంజాప్తఫలహస్త ఘన హనుమంతుఁడ సంజీవని దెచ్చిన శౌర్యుఁడవు రంజిత వానరకులరక్షకుఁడ వైతివి చ. అట లంక సాధించిన హనుమంతుఁడ చటుల సత్త్యసమేత జయ హనుమంతుఁడ ఘటన నలమేల్మంగకాంతు శ్రీవేంకటేశుకుఁ దటుకన బంటవై ధరణి నిల్చితివి