పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

95 రేకు: 0189-02 సామంతంసంపుటము: 02-451 పల్లవి: అందుకుఁగాదు నేఁ గొల్చు టామీఁదిపని కింతే ఇందు నందు నీవే కర్త విందిరారమణ చ. ఇంచుకంత వేలఁగొండ యెత్తిన దేవుఁడవు ముంచి నాసంసారభారము మోవలేవా అంచల దేవతలకు నమృతమిచ్చిన నీవు కంచాన నన్నమువెట్టి కాచుట నన్నెంత చ. వడి ద్రౌపది కక్షయ వలువలిచ్చిన నీవు బెడఁగు నాకుఁ గట్ని(ట్టని?) చ్చి పెంచుటెంత జడసి యింద్రాదులకు సంపదిచ్చినట్టి నీవు కడు నాకు నైహికభోగము లిచ్చు టెంత చ. పొసఁగ లోకములెల్లఁ బూర్జుఁడవైన నీవు వుసురై నాలోన (నే?) నీవు వుండుటెంత వసుధ శ్రీవేంకటేశ వరములిచ్చే నీకు దెస నాకోరికెలెల్లాఁ దీర్చుటెంత పె.అ.రేకు:0069-03 లలిత సంపుటము: 15-396 పల్లవి: అందుకే నాపై దయదలఁచు మాతురబంధుఁడవు యిందరిలో నా దైన్య మేమని చెప్పే నిఁకను చ. నేరని వచ్చినచోట నీ మొగమే చూతుఁ గాని యేరీతిఁ బరిహరింప నే నోపను తీరని పాపము లంటితే నారాయణ యందుఁ గాని పేరుకొని యది విడిపించుకొన నెఱుఁగ చ. పరులు నాఫయిఁ గినిసితే భావింతుఁగాని నిన్నే బిరుద నేనై మలసి తప్పించుకో లేను సరి నాపదైతే నీకే శరణంబు చొత్తుఁగాని వొరులకుఁ జెప్పియట్టే వొడ్డించుకోఁజాలను చ. కడుఁ జింతైతే నీవు గలవని వుందుఁ గాని దిడముగా నా బుద్ధి తిప్పఁగ లేను అడరి శ్రీవేంకటేశ అలమేలుమంగపతి బడివాయకుందుగాని బయపడనేనికను రేకు:0176-02 దేవగాంధారిసంపుటము:02-376 పల్లవి: అందుకే నేఁ జింతించెదను అచ్యుత నీశరణాగతుఁడ సందడి నాభవ మిందువల్లనే నఫలంబాయనయ్యా చ. వొకనీనామము వొగిఁ దలంచిన అకలంకంబగు నాపాపంబులు అన్నియుఁ బారణే సేసే అకటా తక్కిన అనంతనామములు వొకట నుపవాసములున్నవోయయ్యా చ. పరి నీపాదము లవి రెండే పరమును విహమును నా కొసంగెను పయిపైఁ గృపతోడ ధర నీయనంతకరములు తా మేమిసిరు లిత్త మనుచు చెలఁగీనయ్యా చ. ఇల నీదాస్యం బిది యొకటే సిలుగుల భవముల జిలుగు మాన్పెనదె చిత్తము తహ దీర యెలమిని శ్రీవేంకటేశ్వర నీ విదె తలఁపునఁ బాయక దక్కితివయ్యా