పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

94 రేకు:0268-05 ధన్నాసి సంపుటము: 03-393 పల్లవి: అందితినిఁ బొందితి నీయం దఖిలభోగములు కందర్పజనక నాకుఁ గలిగితి విన్నిటా చ. ఘనకుండలములు నీ కథలు నా చెవులకు ననుపైన రుచులు నీ నామములు నాలుకకు అనువై నీకు మొక్కఁగ నంటిన నొసలిమన్ను పనివడి నీకు పట్టబద్ధ(ంధ?)ము చ. మంచి నిర్మాల్యపుదండ మంగళసూత్రము నాకు కాంచనపురాసి నీ చక్కని రూపు నామతికి పంచామృతములు నీ పాదతీర్ధము మేనికి పంచినముద్ర లదే వజ్రాంగిజోడు చ. సకలబంధులు నీ దాసానదాసులే నాకు అకలంక జన్మఫల మన్నిటా నీకృప నాకు ప్రకటపు శ్రీవేంకటపతివి నాయూతుమలో మొకరివై యుండి నన్ను మోహించఁజేసితివి రేకు:0142-01 రామక్రియ సంపుటము: 02-183 పల్లవి: అందుకల్లా లోనుగాన అట్టె యెచ్చరికెతోడ పొందుగా హరిఁ దలఁచే పురుషుడే ఘనుఁడు చ. చలములు పుట్టించ సారె మచ్చరము రేఁచ కలుగు నానావిధ కారణములు తలఁపులు భ్రమయించ తగువేడ్క లొనరించ పలుమా రెదుట నిల్చు బహురూపాలు చ. తగవులు దిద్దించ తగ నలమటఁ బెట్ట తగులు ననేకబంధములెల్లాను పగ సాధింపించ నప్పటి నుపాయాలు నేర్ప నిగిడివచ్చు ననేకనెపములెల్లాను చ. తేరకే మేనలయించ దేశమెల్లా నావటించ వూరకే తోఁచు ననేకవుద్యోగాలు కోరి శ్రీవేంకటేశ్వరుఁ గొలిచి నిశ్చింతుఁడైతే ఆరయ మతిలో నిండు నానందాలు రేకు: 0332-04 మలహరి సంపుటము: 04-187 పల్లవి: అందుకు హరికథ యనుతీర్ధంబున నింద వాసె నిఁక నిర్మలమైతి చ. కంతునిముట్టంటు గల సె మదిలో Cయోంతట శుద్ధానో Cయోరఁగమిఁక సంతత్ర సంసార జలధుల మునిఁగెద పొంతగర్మము పాదింకాను చ. మాయపు టాసల మూలు గల సె మది యేయెడ శుద్ధానో యొరఁగమిఁక ఆయపుభవములయనలము చొచ్చితి పోయినఁగర్మము పోదింకాను చ. చక్కఁగఁ గలిదోసము గలసెను మది నెక్కడ వోయెనో యొరఁగమిఁక దక్కి శ్రీవేంకటదైవముఁ గొలిచితి పుక్కట గర్వము పోదింకాను