పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

93 రేకు:0254-03 గుండక్రియసంపుటము: 03–310 పల్లవి: అందాఁకా వైష్ణవ మటకటకే నిందకుఁ బాసిన నిర్మలుఁడగును చ. పాపపురాసులు పరిహరమైతే దీపించు హరిభక్తి వొడమును పట్టి పుణ్యము చేరువలయితే పత్రిదాసుల సేవే దొరకు ట్టఁగొనకు మతి గోరి పారితే జట్టిగ హరికథ చవిగలుగు పట్టిన జన్మము పావనమైతే మట్టులేని తిరుమంత్రము దొరకు చ. గురుకటాక్ష మొకకొంత సాఁకితే శరణాగతి నిశ్చల మవును యిరవుగ శ్రీవేంకటేశ్వరుఁ గొలిచితే పరమపదమునకుఁ బాత్రుOడవును రేకు:0189-03 గుజ్జరి సంపుటము:02-452 పల్లవి: అందాఁకాఁ దాఁదానే అంత కెక్కుడు గాఁడు ముందు వెన కెంచేనా ముఖ్యుఁడే యతఁడు చ. చిత్త మంతర్ముఖము సేసుకొన నేర్చెనా అత్తల నతఁడు యోగియనఁబడును సత్తసత్తనెడి సువిచారంబు గలిగెనా వుత్తమవివేకియని వూహింపఁబడును చ. భావము నభావమును పరికించి తెలిసెనా కైవల్యనిలయుఁడని కానఁబడును దైవంబుఁ దన్ను మతిఁ దలపోయ నేర్చెనా జీవన్ముక్తుఁడని చెప్పఁబడు నతఁడు చ. అడరి వైరాగ్యధన మార్జించనోపెనా దిడువై జితేంద్రియస్థిరుఁడాతఁడు జడియు శ్రీవేంకటేశ్వరుదాసుఁ డాయనా బడిబడిఁ దుదఁ బరబ్రహ్మమే యతఁడు రేకు:0356-05 గుండక్రియసంపుటము:04-331 పల్లవి: అందిచూడఁగ నీకు నవతారమొకటే యెందువాఁడవైతివి యేఁటిదయ్యా చ. నవనీత చోరా నాగపర్యంకా సవనరక్షక హరీ చక్రాయుధా అవల దేవకిపట్టివని యశోదకు నిన్ను నివలఁ గొడుకవనేదిది యేఁటిదయ్యా చ. పట్టపు శ్రీరమణా భవరోగవైద్య జట్టిమాయలతోడిశారి కృష్ణ పుట్టినచో టొకటి పొదలెడిచో టొకటి యెట్టని నమ్మవచ్చునిది యేఁటిదయ్యా చ. వేదాంతనిలయా వివిధాచరణా ఆదిదేవ శ్రీవేంకటాచలేశ సాదించి తలఁచినచోట నీ వుండుదువట యేదెస నీ మహిమే యిదేఁటిదయ్యా చ.