పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

92 రేకు:0108–06 సామంతంసంపుటము: 02-048 పల్లవి: అందరివలెనే వున్నాఁ డాతడాఁ వీఁడు యిందుముఖులఁ గూడినాఁడీతఁడానాఁడు చ. యిందరూ నేఁటేఁట జేసే యింద్రయాగపు ముద్దలు అందుకొని యూరగించినాత్రCడా వీఁడు చెంది మునులసతుల సతఁ దెప్పించుక మంచివిందు లారగించినాఁడు వీఁ డానాఁడు చ. తొలుత బ్రహ్మ దాఁచిన దూడలకు బాలులకు అలరి మారు గడించినాతఁడా వీఁడు నిలుచుం డేడుదినాలు నెమ్మది వేలఁ గొండెత్తి యిల నావులఁ గాచినాఁ డీతఁ డానాఁడు చ. బాలుఁడై పూతనాదుల బలురక్కసులఁ జంపి ఆలరి యూటలాడిన యూత్రcడా వీఁడు యీలీల శ్రీవేంకటాద్రి యొక్కినాఁడు తొలుతే యేలెను బ్రహ్మాదుల నీతఁ డానాఁడు చి.ఆ.రేకు:0008-02 లలిత సంపుటము: 10-044 పల్లవి: అందరు వికార మందుదురె నిందలేని నీవు నీదాసులు దక్క చ. సతుల సుతులఁ జూచి జగములోవారెల్లా మతిలోన భ్రమయక మానరు రతికెక్కఁగా హేయరాగరహితుడవై సతతము గలిగినస్వామివి నీవు దక్క చ. ధనధాన్యములుచూచి తగినజీవులు వాని వెనువెంటఁ దిరుగక విడువరు పనివూని యూశాపాశ దూరుఁడవై ఘనతగలుగు శ్రీకాంతుఁడ నీవుదక్క చ. యిల్లుముంగిలిచూచి యీదేహులు వాని నొల్ల మనుచురోసి వుడుగరు వెల్లవిరిగ శ్రీవెంకటనాధుఁడవై తెల్లమైనయట్టి దేవుఁడవుదక్క రేకు:0203-06 లలిత సంపుటము: 03-018 పల్లవి: అందాఁకా నమ్మలేక అనుమానపడు దేహి అంది నీ సామ్మ గనక అదియుం దీరుతువు చ. నీదాసుఁడన నేటి నిజబుద్ధి గలిగితే ఆ దెస నప్పుడే పుణ్యుఁడాయ నతఁడు వేద(దు?)తో నొక్కొక్కవేళ వెలుతులు గలిగితే నీదయవెట్టి వెనక నీవే తీరుతువు చ. తొలుత నీ శరణము దొరకు టోకటే కాని చెలఁగి యూ జీవునికిఁ జేటు లేదు కలఁగి నడుమంత్రాన గతిదప్ప నడచిన నెలకొని వంకలొత్త నీవే నేరుతువు చ. నీవల్లఁ గొరత లేదు నీ పేరు నొడిగితే శ్రీవేంకటేశ యిటె చేరి కాతువు భావించలేకుండఁగాను భారము నీ దంటేఁ జాలు నీవారి రక్షించ నీవే దిక్కౌదువు