పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

91 రేకు: 0065-02 పాడి సంపుటము: 01-335 పల్లవి: అందరిబ్రదుకులు నాతనివే కందువెల్ల శ్రీకాంతునిదే చ. వేమరుఁ జదివెడి విప్టుల వేదము సాముకవైరి యశోవిభవం శ్రీమించున మరల జీవనమెల్ల సుధామథనునిసంతత కరుణే చ. హితవగు నిలలో నీసుఖమెల్లను దితి సుతదమనుఁడు దెచ్చినదే తతి తల్లిదండ్రి తానై కాచిన రతి ప్రహ్లాదవరదుని కృపే చ. ఆలరినయమరేంద్రాదుల బ్రదుకులు బలిబంధనుకృపఁ బరగినవే బలసి మునుల యూపదలు వాపుటకు బలునృపభంజను పరిణతలే చ. పూని యనాధుల పారిందుగఁ గాచిన జానకీవిభుని సరసతలే నానాభూభరణOబులు నOదునిసూనుఁడు చేసినసుకృతములే చ. తలకొని ధర్మము తానై నిలుపుట కలుషవిదూరునిగర్వములే నిలిచి లోకములు నిలిపినఘనుఁడగు.కలియుగమున వేంకటపతివే రేకు:0146–02 నాట సంపుటము: 02-207 పల్లవి: అందరిలోనా నెక్కుడు హనుమంతుఁడు కందువ మతంగగిరి కాడి హనుమంతుఁడు చ. కనకకుండలాలతో కౌపీనముతోడ జనియించినాఁడు యూ పూనుమంతుఁడు ఘన ప్రతాపముతోడ కఠినహస్తాలతోడ పెనుతోఁక యెత్తినాఁడు పెద్ద హనుమంతుఁడు చ. తివిరి జలధి దాఁటి దీపించి లంకయెల్లా అవల యివల సేసె హనుమంతుఁడు వివరించి సీతకు విశ్వరూపము చూపుతా ధ్రువమండలము మోచె దొడ్డ పూనుమOతుఁడు చ. తిరమైన మహిమతో దివ్యతేజముతోడ అరసి దాసులఁ గాచీ హనుమంతుఁడు పరగ శ్రీవేంకటేశు బంటై సేవింపుచు వరములిచ్చీఁ బొడవాటి హనుమంతుఁడు