పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

89 పె.అ.రేకు:0045-05 నాట సంపుటము: 15-251 పల్లవి: అంతా నీకు లోనే అనిరుద్దా మన యంతరంగ మొక్క టాయె ననిరుద్దా చ. అడ్డమాడఁ జాలము నీ కనిరుద్దా అడ్జెఁ డమ్మీనాఁడుఁ బోడియనిరుద్దా అడ్డివెట్ట నింక నేల యనిరుద్దా అడ్డాఁక లెంచకుమీ యనిరుద్దా చ. అప్పటి వేఁడుకొనేవా అనిరుద్ధ నీకు నప్పణ నే నిచ్చేనా యనిరుద్దా అప్పుడే విన్నవించనా అనిరుద్ధ వొద్ద నప్పసమై వున్నదాన ననిరుద్దా చ. ఆయ మెఱుఁగుదువోయి అనిరుద్దా ఆయెడను డి వచ్చితి వనిరుద్దా ఆయితమై కూడితివి అనిరుద్దా ఆయనాయ శ్రీవేంకట యనిరుద్దా రేకు: 0067-06 సామంతంసంపుటము: 01-351 పల్లవి: అందరి కాధారమైనఆదిపురుషుఁ డీతఁడు విందై మున్నారగించె విదురునికడ నీతఁడు చ. సనకాదులు గొనియాడెడి సర్వాత్మకుఁ డీతఁడు వనజ భవాదులకును దైవంబైనతఁడీతఁడు యినమండలమునఁ జెలఁగేటిహితవైభవుఁ డీతఁడు మునువుట్టిన దేవతలకు మూలభూతి యీతఁడు చ. సిరులొసగి యశోదయింట శిశువైనతఁడీతఁడు ధరనావులమందలలో తగఁ జరించె నీతఁడు సరసతలను గొల్లెతలకుఁ జనవులొసంగె నీతఁడు ఆరసి కుచేలునియడుకు లారగించె నీతఁడు చ. పంకజభవునకును బ్రహ్మపద మొసంగెను యీతఁడు సంకీర్తన లాద్యులచే జట్టిగొనియె నీతఁడు తెంకిగ నేకాలముఁ బరదేవుఁడయిన యీతఁడు వేంకటగిరిమీఁద బ్రభల వెలసినఘనుఁ డీతఁడు రేకు:0170-05 హిందొళ వసంతంసంపుటము:02-343 పల్లవి: అందరి రక్షించే దేవుఁ డాదరించీ జీవులను పారిందుగా యీమేలెరిఁగి పొగడరో లోకులు చ. వనము వెట్టినవాఁడు వాఁడకుండా నీరు వోసి పెనచి కలుపు దీసి పెంచినయట్లు పనివడి గొల్లవాఁడు పచ్చికపట్టునఁ బసుల తనియఁగ నిల్పి నిల్పి తానే మేపినట్లు చ. కన్నతల్లి బిడ్డలకు కానుక వెన్నయుఁ బాలు నన్నము నిడి రక్షించినటువలెను యెన్నఁగ బంట్లనేలే యేలిక జీతాలు వెట్టి మన్నించి కాచుకొని మనిపినయట్లు చ. వసుధ వైద్యుఁడైనవాడు మందుమాకు లిచ్చి పొసఁగ దేహధారులఁ బోషించినట్లు యెసఁగ శ్రీవేంకటేశుఁ డితఁడే విశ్వకుటింబి పసగా వరము లిచ్చి భావించీనట్లు