పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

88 రేకు:0193-02 లలిత సంపుటము:02-475 పల్లవి: అంతర్యామీ అలసితి సాలసితి యింతట నీ శరణిదె చొచ్చితిని చ. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచకా భారపుఁ బగ్గాలు పాపపుణ్యములు నేరుపులఁ బోవు నీవు వద్దనకా చ. జనుల సంగములఁ జక్కరోగములు విను విడువవు నీవు విడిపించకా వినయపు దైన్యము విడువని కర్మము చనదిది నీవిటు సంతపరచకా చ. మదిలో చింతలు మయిలలు మణుఁగులు వదలవు నీవని వద్దనకా యెదుటనేఁ శ్రీవేంకటేశ్వర నీవదే అదనఁ గాచితివి అట్టిట్టనకా రేకు:0279-06 లలితసంపుటము: 03-458 పల్లవి: అంతర్యామీ వో అంతర్యామీ బంతి నాకేమిగల్లా నా పాలివాఁడవు గావా చ. దొంతులై అన్ని యోనులాఁ దొల్లి నేఁ బుట్టేటినాఁడే అంతరాత్మవైనవాఁడ వటు నీవేకా ఇంతట విడిచేవా నన్నింబ్రియాలఁ గట్టివేసి పొంతఁ జూచేవిటు నాకుఁ బొత్తులకాఁపవుగా చ. తొడరి స్వర్గనరక దుఃఖసుఖములనాఁడు అడరి కర్మసాక్షివటు నీవేకా విడువ వెప్పుడు నన్ను విషయాలఁ జిక్కినాఁడ కడ నూరకుండనేల కన్నవాఁడవు గావా చ. నీ చేతఁగానిది లేదు నీవు నాకుఁ బ్రాణమవు కాచుటకు నీకంటే నొక్కరు వచ్చేరా చేచేత శ్రీవేంకటేశ చేరి నీకు శరణంటి యేచి నన్ను మన్నించితివిది నీ తేజముగాదా రేకు:0220-06 ధన్నాసి సంపుటము: 03-113 పల్లవి: అంతవాని కింతసేయ నమరునటే వింతలు యీసుద్దులకే వెరగయ్యి మాకు చ. కదిసి బ్రహ్మాండములు గర్భములోనున్నదేవుఁ డిదె దేవకి గర్భాన నెట్టు పుట్టెనే అదె మల్ట్రాకుమీఁదట నటు పవ్వళించువాఁడు యెదుట యశోదచేత నెట్టు వినోదించీనే చ. అడుగులుమూఁట లోకాలటు గొలచినవాఁడు బడిబడి రేపల్లెఁ బారాడీని అడరి యజ్ఞభాగము లారగించే దేవుఁడు సడితో వెన్న ముచ్చిలి చవిగొనీనిదివో చ. వేదపల్లవములందు విహరించే దేవుఁడు సాదుగొల్లెతల రతిసంగడిఁ జిక్కె మోదపు వైకుంఠాన ముదమందే కృష్ణుడు యీదెస శ్రీవేంకటాద్రి నిరవాయు నిదివో