పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

87 రేకు: 0178-03 లలితసంపుటము:02-388 పల్లవి: అంతరాత్మ హరి గలఁడంతే చాలు యెంతకెంత చింతించనేలా వెరవ చ. వెనక జన్మపు గతి వివరించి నే నెరగ అనుగు మీఁదటి జన్మమది యొఱగ ననిచి యీ జన్మము నానాఁట దెలిసేము యొనసి యీ భవములకేలా వెఱవ చ. నిన్నటి దినము కత నిమిషమై తోఁచీని కన్నుల రేపటి చేఁత కానఁగరాదు పన్ని నేఁటి దినము మున్ను నోఁచినట్లే యెన్నఁగ నెందుకునైనానేలావెఱవ చ. పరము నిహము నేఁ బైకొన నా యిచ్చగాదు హరి శ్రీవేంకటపతి యఖిలకర్త శరణంటి నాతనికి స్వతంత్ర మతనిది యిరవైతి నింకా నాకేలా వెఱవ రేకు:0103-05 మలహరి సంపుటము:02-017 పల్లవి: అంతరుమాలినయట్టి అధములాల పారింత సంతకూటమి పారిచూపు గాదా చ. కనక మిత్తడితోడ కలయ సరిదూ(చితే అనువవునా అది దోషమవుఁ గాక ఘనుఁడైన హరితోఁ గడుపీూనదేవతల ననిచి సరివెట్టితే నయమవునా భువిని చ. పట్టభద్రుఁడు గూర్చుండే బలుసింహాసనముపై వెట్టిబంటుఁ బెట్టేవారు వెఱులేకారా గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతలఁ బెట్టి కొరెలుచుట విందువెట్టి 66তে০তে০ చ. కొంచక సింహముండేటి గుహ నుండవచ్చునా పొంచి నక్కలకెల్ల బొక్కలే కాక అంచెల శ్రీవేంకటేశుఁ డాత్మలోనే వుండఁగాను కొంచపుదైవాల పలువంచలనే కాక రేకు:0079-06 లలితసంపుటము: 01-381 పల్లవి: అంతర్యామీ అలసితి సాలసితి యింతట నీ శరణిదె చొచ్చితిని చ. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపుఁ బగ్గాలు పాపపుణ్యములు నేరుపులఁ బోనీవు నీవు వద్దనక చ. జనుల సంగములఁ జక్కరోగములు నిను విడువవు నీవు విడిపించక వినయపు దైన్యము విడువని కర్మము చనదిది నీవిటు సంతపరచక చ. మదిలో చింతలు మయిలలు మణుఁగులు వదలవు నీవవి వద్దనక యెదుటనేఁ శ్రీవేంకటేశ్వర నీవదే అదనఁ గాచిత్రివి అట్టిట్టనక