పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రేకు: 0155-03 దేసాళం సంపుటము:02-259
పల్లవి: అంతరంగములో నున్న హరియే గతిగాక
చింతించి మొక్కితేఁ దానే చేకొని రక్షించును
చ. పుట్టించిన కర్మమే పోషించకుండునట
    బెట్టుగా మనసే మఱపించునట
    పట్టెన మేనే ఆసల బతిమాలింపించునట
    చుట్టములెవ్వరు యెంచి చూచినఁ బ్రాణికిని
చ. పక్కన విత్తినభూమి పంట వండకుండునట
    యెక్కడా మాయే భ్రమయింపించునట
    అక్కరతోఁ జేసిన పుణ్యమే కట్టివేసునట
    దిక్కు దెస యెవ్వరు యీ దేహిఁ గరుణించను
చ. ఆసలఁ బెట్టే పాయమే అటమటమౌనట
    సేసే సంసారమే జ్ఞానిఁ జేయునట
    వేసరక యింతకూ శ్రీవేంకటేశు డేలికట
    మోసపుచ్చేవారెవ్వరు ముదమే జీవునికి
రేకు:0089-03 శుద్ధవసంతంసంపుటము:01-437
పల్లవి: అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే
       వింతవింతవిధముల వీడునా బంధములు
చ. మనుజుఁడై ఫలమేది మఱి జ్ఞానియాదాఁక
    తనువెత్తి ఫలమేది దయగలుగుదాఁక
    ధనికుఁడై ఫలమేది ధర్మము సేయుదాఁకా
    పనిమాలి ముదిసితే పాసెనా భవము
చ. చదివియు ఫలమేది శాంతముగలుగుదాఁకా
    పెదవెత్తి ఫలమేది ప్రియమాడుదాఁకను
    మదిగల్గి ఫలమేది మాధవుఁ దలఁచుదాఁకా
    యెదుట తారాజై తే నేలెనా పరము
చ. పావనుఁడై ఫలమేది భక్తిగలిగినదాఁకా
    జీవించేటిఫలమేది చింతవీరుదాఁకను
    వేవేల ఫలమేది శ్రీవేంకటేశుఁ గన్నదాఁకా
    భావించి తా దేవుఁడై తేఁ బ్రత్యక్షమవునా
రేకు:0248-01 ధన్నాసి సంపుటము: 03-272
పల్లవి: అంతరాత్మ నీ యూధీన మింతయు
       చింతలు సిలుగులు జీవులకెల్లా
చ. చిత్తంబనియెడి సింహాసనమది
    వుత్తమ పురుష నీవుండెడిది
    హత్తి యింద్రియములందుఁ బ్రధానులు
    ప్రత్తెక్ష రాజ్యము ప్రకృతియుఁ గలిగె
చ. కన్నులుఁ జెవులును ఫ్రూణము నాలికె
    వన్నెమేను నీ వాహములు
    పన్నిన కోర్కులు భండారంబులు
    సన్నుతి సంసారసంపద గలిగె
చ. పుట్టిన పుట్టుగు భోగపుకొటారు
    పట్టము కర్మానుబంధంబు
    గట్టిగ శ్రీవేంకటపతి వేలిక-
    విట్టి నీ మహిమ లిన్నిటఁ గలిగ