పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రేకు:0297-03 గుండక్రియ సంపుటము: 03-562
పల్లవి: అంతయు నతని మహా మహిమే అతఁ-
       డెంత సేసినా నెట్టయిన నవును
చ. రావలెనన్నవి రాకమానవు
    పావలె నన్నవి పోకుండవు
    ఆవల నీవల నలమటలేఁటికి
    దైవమొక్కఁడే తగిలిన గుఱుతు
చ. కాయపు గుణములు కలిగినవే భువి
    నీ యెడ జీవుఁడు యిటు గలఁడే
    ఆయమిందుఁ గా దవునన నెవ్వరు
    కాయజగురుఁ డొక్కఁడే ప్రేరకుఁడు
చ. అంతరంగమే యాత్మజ్ఞానము
    వింతగు వెలుపల వెడమూయు
    చింతించి రక్షించ శ్రీవేంకటేశుఁడు
    మంతుకెక్కె నిఁక మతకములేల
రేకు:0080-04 పాడి సంపుటము: 01-385
పల్లవి: అంతయు నీవే హరి పుండరీకాక్ష
       చెంత నాకు నీవే శ్రీరఘురామా
చ. కులమును నీవే గోవిందుఁడా నా
    కలిమియు నీవే కరుణానిధీ,
    తలఁపును నీవే ధరణీధరా నా
    నెలవును నీవే నీరజనాభా
చ. తనువును నీవే దామోదరా, నా
    మనికియు నీవే మధుసూధనా
    వినికియు నీవే విట్టలుఁడా, నా-
    వెనకముందు నీవే విష్ణుదేవుడా
చ. పుట్టుగు నీవే పురుషోత్తమా కొన
    నట్ట నడుము నీవే నారాయణా,
    యిట్టె శ్రీవేంకటేశ్వరుఁడా నాకు
    నెట్టన గతి యింక నీవే నీవే
పె.అ.రేకు: 0067-01 గుజ్జరి సంపుటము: 15-382
పల్లవి: అంతరంగములో నున్న హరియే గతి గాక
       చింతించి మొక్కితేఁ దానే చేకొని రక్షించును
చ. పుట్టించిన కర్మమే పోషించకుండు నట
    బెట్టుగా మనసే మరపించు నట
    పట్టయిన దేహమే బతిమాలింపించు నట
    చుట్టము లెవ్వరు యెంచి చూచినఁ బ్రాణికిని
చ. పక్కన విత్తినభూమి పంట వండకుండు నట
    యొక్కడా మాయే భ్రమయింపించు నట
    అక్కరతోఁ జేసిన పుణ్యమే కట్టివేసు నట
    దిక్కుదెస యెవ్వరు యీ దేహిఁ గరుణించను
చ. ఆసలఁ బెట్టే పాయమే అటమట మౌనట
    చేసే సంసార మజ్ఞానిఁజేయునట
    వేసారక యింతకూ శ్రీవేంకటేశుఁ డేలికట
    మోసపుచ్చే వారెవ్వరు ముదమే జీవునికి