పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు


రేకు: 9029-04 రామక్రియ సంపుటము: 04-550
పల్లవి: అంటుకోకురో యమ్మలాలా యీ
       మంటవడ్డ కోరికల మాఁటువారము
చ. మాసిన యాసలనెడి మాలెత వెంట వెంటనే
    పాసి వుండలేక బాధఁబడ్డవారము
    బేన బెల్లి యెంగిలైన పదవినంజుడు నోరఁ
   దీసి తీసి సారె సారెఁ దిన్నవారము
చ. ఇట్టు నట్టు ముట్టరాని హేయమైన తోలుఁదోలు
    కుట్టి కుట్టి సిగ్గులమ్మకొన్నవారము
    ముట్టు సేయుచోటనే మూలమూల సారె సారెఁ
    బుట్టి పుట్టి యూపదలఁ బొరిందువారము
చ. చంపి చంపి జీవులనే చవులంటఁ జెడ్డతోలుఁ
    గొంపలోనఁ దెచ్చి పెట్టుకొన్నవారము
    ఇంపుల నిప్పుడు వేంకటేశుఁజేరి భవముల
     చింపి యింటి హరిభక్తి చరవారము
రేకు:0334-06 కాంభోది సంపుటము: 04-201
పల్లవి: అంతటనే వచ్చి కాచు నాపద్బంధుఁడు హరి
       వంతుకు వాసికి నతనివాఁడనంటేఁ జాలు
చ. బంతిఁగట్టి నురిపేటి పసురము లెడ నెడఁ
    బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు
    చెంతల సంసారము సేయు నరుఁడందులోనె
    కొంత గొంత హరి నాత్మఁ గొలుచుటే చాలు
చ. వరుసఁ జేఁదు దినేవాడు యెడ నెడఁ గొంత
    సరవితోడుతఁ దీపు చవిగొన్నట్టు
    దురితవిధులు సేసి దుఃఖించు మానవుఁడు
    తరవాత హరిపేరు దలఁచుటే చాలు
చ. కడుఁ బేదైనవాఁడు కాలకర్మవశమున
    అడుగులోనే నిధాన మటు గన్నట్టు
    యెడసి శ్రీవేంకటేశు నెరఁగక గురునాజ్ఞ
    పొడగన్నవానిభక్తి పొడముటే చాలు
రేకు:0243-06 దేవగాంధారిసంపుటము: 03-247
పల్లవి: అంతటిదైవము వటుగాఁగా
       చెంత నిన్నుఁ గూర్చినదే ఘనము
చ. వెరవునఁ బంచమవేద సారములు
    సిరుల నిను నుతించిన నుతులు
    సరవితోడి బహుశాస్త్రసంతతులు
    నిరతిఁ జెప్పెడిని నీకథలు
చ. కొంగుపైడియగు గురుమంత్రంబులు
    సంగడి వైష్ణవసంభాషలు
    నింగికి భూమికి నిజపురాణములు
    సంగతిగల నీ సంకీర్తనలు
చ. వూనిన విధుల మహోపనిషత్తులు
    నానాగతి నీనామములు
    వీనులకును శ్రీవేంకటేశ మీ-
    జ్ఞానార్ధములు మిముఁ జదువు చదువులు