పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/738

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

736 గెలుప (గం) దెలిసి లంకించిన మతితోఁ జెలఁగుకంటె నిజసిరి యిఁకఁ గద్దా చ. పోయముకంటె నపాయము గద్దా కాయపు రోఁతకుఁ గడ గద్దా పాయక వేంకటపతి కృప గోరిన యీయభిమతమున కెదురిఁకఁ గద్దా రేకు:0011-03 గౌళ సంపుటము: 01-069 పల్లవి: నేలమిన్ను నొక్కటైన నీబంటు వొక్క వేలనే యక్షునిఁ దెగవేసెఁగా నీ బంటు చ. ఉంగరమెగరవేసి యుదధిలోఁ బడకుండ నింగికిఁ జెయిచాఁచె నీబంటు చంగున జలధిదాఁటి జంబుమాలి నిలమీఁద కుంగఁదొక్కి పదములఁ గుమ్మెఁగా నీబంటు చ. వెట్టగా రావణు రొమ్మువిరుగఁ జేతనే గుద్దె నిట్టతాడువంటివాఁడు నీబంటు దిట్టయై మందులకొండ తేజమున నడురేయి పట్టపగలుగఁ దెచ్చె బాపురే నీబంటు చ. అలర నన్నియుఁ జేసి అజునిపట్టానకు నిలుచున్నాఁ డదివో నీబంటు బలువేంకటేశ ఈ పవననందనుఁడు కలిగి లోకములెల్లఁ గా చెఁగా నీబంటు పె.అ.రేకు : 0031-05 సాళంగనాట సంపుటము: 15-175 పల్లవి: నేవే భావే శ్రీ బృందం శ్రీవల్లభ చింతానందం చ. పటుకుతర్కనగ భంజన దీక్షం కుటిల దురితహరగుణ దక్షం ఘటితమహాఫల కల్పకవృక్షం చటుల రామానుజ శమదమభిక్షం చ. కృద్ధమృషామత కుంఠన కుంతం బౌద్ధాంధకార భాస్వంతం శుద్ధచేదమణి సుసరస్వంతం సిద్ధాంతీకృత చిన్మయకాంతం చ. చార్వాకగహన చండకుఠారం సర్వాపశాస్త్ర శతధారం నిర్వికారగుణ నిబిడ శ్రీవేంక టోర్వీధర సంయోగ గంబీరం రేకు:0023-02 ధన్నాశి సంపుటము: 01-138 పల్లవి: పంకజాక్షులు సాలసిపలికి నగఁగా నింకా నారగించు మిట్టనే ఆయ్యా చ. కలవOటకములు పులుఁగములు దుగ్గాన్నములు పలుదెరఁగులై న అప్పములగములు నెలకొన్న నేతులును నిరతంపు చక్కెరలు గిలుకొట్టుచును నారగించవయ్యా చ. పెక్కువగు సైఁ దంపుపిండి వంటల మీఁద పిక్కటిలు మెఱుఁగు బొడి బెల్లములును