పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/737

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

735 నెట్టనఁ దలపోసితే నేనేమి పరు లేమి గట్టిగా స్వతంత్రుడు శ్రీకాంతుఁడింతె కాక చ. వూరకె వొక్కరి నైతే వొచ్చములు వట్టేను కారుకమ్మినట్టి నాకల్ల లెంచను గారవించి శ్రీవెంకటనాథుఁడు నన్ను సారెకు రక్షించఁగాను జయ మాయఁ గాకా రేకు:0098-05 సాళంగం సంపుటము: 01-493 పల్లవి: నేరిచిబ్రదికేవారు నీదాసులు నేరమిఁ బాసినవారు నీదాసులు చ. కామముఁ గ్రోధము రెంటీఁ గాదని విడిచి మంచి నేమము వట్టినవారే నీదాసులు దోమటి బాపపుణ్యాలఁ దుంచివేసి చూడగా(నే నీమాయు గెలిచినారు నీదాసులు చ. కిక్కిరించిన యాసలఁగిందవేసి మోక్షము నిక్కి నిక్కి చూచేవారు నీదాసులు వెక్కసపు భక్తితోడ వెఱపు మఱపు లేక నెక్కొన్న మహిమవారు నీదాసులు చ. అట్టె వేదశాస్త్రముల అర్థము దేటపఱచి నెట్టుకొని మించినారు నీదాసులు యిట్టె శ్రీవేంకటేశ యితరమార్గములెల్లా నెట్టువడఁ దోసినారు నీదాసులు రేకు:0283-01 దేసాళం సంపుటము: 03-476 పల్లవి: నేరుపు నతఁడే నేరమి నతఁడే భారమెల్ల నాతఁడే పని లేదు మాకు చ. దేవుఁడట యంతరాత్మ దేహమెంచి చూచితేను పోవుల కర్మాలు సేయఁ బుట్టినదట జీవుఁ డేఁటివాఁడిందు శ్రీపతియానాజ్ఞఁ గాక భావించఁ బాపపుణ్యాలు పనిలేదు మాకు చ. హరి లోకాలేలునట అతని మాయకు లోనై నరుల జీవనములు నడచీనట వెరవులు మాకేల విష్ణుఁడే యింతాఁ గాక పరచు విచారాలు పనిలేదు మాకు చ. వేడుక నాలుకను శ్రీవేంకటేశు నామమట పాడితో నాతనికి నే బంటనట తోడునీడ యూతఁడే తోవ చూప నాతఁడే పాడయిన కోరికలు పనిలేదు మాకు రేకు: 9116-01 ముఖారి సంపుటము: 04-599 పల్లవి: నేర్పుకంటెఁ బెన్నిధి గద్దా ఓర్పుకంటె సుఖమొకటిఁక ಗೆದ್ದ చ. కరుణకు నెక్కుడు గతి యిఁకఁ గద్దా సరసతకెక్కుడు సరి గద్దా గురుమతిఁ జత్తము కూరిమి నిలిపిన వెరవుకంటె విధమిక గద్దా చ. కలిమి కంటెఁ జీఁకటి మలి కద్దా బలిమికంటె నాపద గద్దా