పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/734

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

732 గడుసు దొంగైన వాఁడొకఁడు కొండలో దాఁగితే యెడ మిచ్చినకొండకు హీన మయిన్యానా చ. కందువ శ్రీ వేంకటేశ కరుణారసము నాపై చిందరాదా అనుమాన చింత లేఁటికి యిందరిపై సూర్యుఁడు యెండలు గాసితేను అందుకొన్ని కిరణాలు ఆరగిపోయినానా రేకు:0208-06 బౌళిరామక్రియ సంపుటము: 03-048 పల్లవి: నేనొక్కఁడ లేకుండితే నీ కృపకుఁ బాత్రమేది పూని నా వల్లనే కీర్తిఁ బొందేవు నీవు చ. అతిమూడులలోన నగ్రేసరుఁడ నేను ప్రతిలేని ఘనగర్వపర్వతమను తతిఁ బంచేంద్రియముల ధనవంతుఁడను నేను వెతకి నావంటివాని విడువఁగఁ జెల్లునా చ. మహిలో సంసారపుసామ్రాజ్యమేలేవాఁడ నేను యిహమునఁ గర్మ వహికెక్కితి నేను బహుయోనికూపసంపదఁ దేలేవాఁడ నేను వహించుక నావంటివానిఁ దేనోపేవా చ. భావించి నావంటి నీచుఁ బట్టి కాచినప్పుడుగా యేవంక నీకీర్తి గడునెంతురు భువి నావల్ల నీకుఁ బుణ్యము నీవల్ల నే బ్రదుకుదు శ్రీవేంకటేశుఁడ యింత చేరెఁ జుమ్మీ మేలు పె.అ.రేకు:0003-06 శుద్ధవసంతం సంపుటము: 15-019 పల్లవి: నేము నీ కన్యులమా నీవు మాలో లేవా యీ మేరలనే మమ్ము యేలుకొందు గాకా చ. ధర విభీషణుఁడు మీ తల్లి కడవాఁడా నిరతి ఘంటాకర్జుఁడు నీ తండ్రివాఁడా యిరవై ధృవుఁడు మీ యిల్లాలి కడవాఁడా శరణన్న మాటలోనే సరుగఁ గాచితివి చ. మున్నిటి శబరి నీకు ముమ్మనుమరాలా మిన్నక వుద్ధవుఁడు మీ మేనమామా పన్నిన వుడుత నీకు పాయరానిచుట్టమా యెన్నఁగ వీరల నెల్ల నింతలో మెచ్చితివి చ. అహల్య నీ కూతురా అక్రూరుఁడు గొడుకా విహరించ నీకు శ్రీ వేంకటేశుఁడా వహి ముత్తాతలా నీచే వరములు గొన్నవారు మహి నిందులకెపాశీ నీ మఱుఁగు చొచ్చితిని రేకు:0308–04 సౌరాష్ట్రం సంపుటము: 04-046 పల్లవి: నేము సేసేయందు మారు నీవే చేకొంటివి నేమపు నాపూజలెల్లా నీకు నెక్కెనయ్యా చ. పాలజలనిధిలోనఁ బవ్వళించినది యేపా8 వాలిన నీకు జలాధివాసము కోలు ముందై బ్రహ్మయజ్ఞకుండములాహుతి గొని వోలినుండే అది నీకు హోమము చ. ఆడన 'నాపాశీనారామణుఁడ వంున నీకు ఆదియపో మంత్రకలశాభిషేకము