పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/733

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

731 విరులు చల్లుట నాది వేవేలిచ్చుట నీది పొరి నీవు భక్తసులభుఁడ వటుగాన చ. దాసుఁడననుట నాది తప్పక యేలుట నీది ఆసదీర్చే వరదుఁడ వటుగాన నీసేవ యొక్కటి నాది నిచ్చలుఁ గైకొంట నీది యీసులేని శ్రీవేంకటేశుఁడవు గాన రేకు:0175-05 నాదరామక్రియ సంపుటము: 02-373 పల్లవి: నేనేమెరిఁగి సేసేనో నీకుఁ దిరువారాధన ఆని మున్నిటి బ్రహ్మరుద్రాదులు సేయఁగలేరు చ. అనుగు నీరూప మింతంతనెరిఁగి సేసేనో వునికై నీ వొక్కచోనే వుండేదెరిఁగి సేసేనో తనిసి నీకు నొక్కమంత్రమునెరిగిఁ సేసేనో కనరాని నీమహిమే కడయెరిఁగి సేసేనో చ. మరిగి నీకు నొక్కనామమునెరిఁగి సేసేనో అరసి యించుకే కాలమనెరిఁగి సేసేనో నిరత్రి నీకేమి లేవని యెరిగి సేసేనో బెరసి నన్ను గొంత మెప్పించనెరిగి సేసేనో చ. తెలిసి నీకు నొక్కమూర్తియనెఱిఁగి సేసేనో అలమిన నీమాయఁ గొంతనెరిఁగి సేసేనో అలమేల్మంగకుఁ బతియగు శ్రీవేంకటేశుఁడ వొలసి నీ కుపమింప నొక్క టెరిఁగి సేసేనో రేకు: 0370-05 లలిత సంపుటము:04-414 పల్లవి: నేనై విడువవద్దు తానై తగులవద్దు తానే తానై వుంటేఁ దగులెల్ల నూడు చ. పొద్దు వొద్దు పూలిఁ దలఁపున దలపాశీయఁగ వొద్దికైన పలుచేత లున్న వెల్లా మరచును నిద్దిరించువాని చేత నిమ్మ పంటివలెనే బుద్దితోఁ గర్మములు గొబ్బున జారిపోవును చ. పలుమారు గురుసేవఁ బరగఁగా బరగఁగా చలివాసి యాత్మవిజ్ఞానముఁ బొడచూపు కలగన్నవాఁడు మేలుకనిన కలవలెనే పలుసంసారములెల్ల భావనలై యుండును చ. పక్కన శ్రీ వేంకటేశుపై భక్తి వొడమఁగా అక్కజపు టిహపరా లరచేతివి యాను చొక్కపు పరుసమంటి సాంపుగానిలోహము నిక్కఁ బైఁడైనట్టు నెరుసెల్లఁ దొలఁగును పె.అ.రేకు:0004-03 హిజ్జిజి సంపుటము: 15-022 పల్లవి: నేనైతే నీడేరుదు నీకు లీలా మాత్ర మింతే మానక నన్నేలు కొమ్మి మాధవ గోవింధా చ. నీవు నన్ను మన్నించితే నీ మహిమలోఁ గొంత యీవల వెలిత్రి యానా యీ లోభ మేలా కావించి పాలజలధికడ నొక్క తుంపురు వేవేగ విదలించితే వెలితి యెందులకు చ. వెడకరినైనా నన్ను వెనక వేసుకొంటేను గొడవ నీకు వచ్చీనా కొంక నేఁటికి