పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/732

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

730 మానక జీవునికి మనసు దోడై వున్నట్టు ఆనుకొనెప్పుడుఁ దగులై నీ వున్నాఁడవు చ. మలసి నాలికెకు నీ మంత్రము ఫలమైనట్టు అలరి నా కిటు దాతవై వున్నాఁడవు తలకొన్న బిడ్డలకు తలిదండ్రివై వున్నట్టు సులభవు శ్రీవేంకటేశుఁడవై వున్నాఁడవు రేకు: 0310-03 దేసాళం సంపుటము:04-057 పల్లవి: నేనే పో ఘనుఁడను నీకంటెను దానవారి నీవు నాకు దైవమవు గాన చ. నేరుపున నాకైతే నీ దిక్కు గలదుగాని చేరి నీ కావల దిక్కు చెప్పి చూపఁగలదా అరయ నీవైతే నాకు నాధారము గలవు గా నూరకే నీకాధారము వున్నదా యొక్కడను చ. నిన్నుఁ గొల్చిన సలిగె నేఁడు నాఁకు గద్దుగాని సన్నుతి నీకు నొకరి సలిగున్నదా పెన్నిధి నిన్నుఁ దలఁచే పేరు నాకుఁ గద్దుగాని వున్నదా నీకుఁ దలఁచ నొకరి పేరైనను చ. యీవులెల్లా నాకైతే నియ్యఁగలవు గాక ఆవల నీకీవులియ్య నన్యులున్నారా శ్రీవేంకటేశ నాకు జీవాంతరాత్మవు నీవు భావించ నంతరాత్మయప్పటి నీకు నున్నదా రేకు:0266-05 ధన్నాసి సంపుటము: 03–381 పల్లవి: నేనేమి బాఁతి నీకు నీరుణము పాపలేను నానావిధముల నీవే నన్నుఁ బాయవుగా చ. మతిలో చీఁకటి మాన్స మాణిక్యదీపమవై సతమై నాలికె పైకి చవి దేనెయె కతలై నన్నుఁ జొక్కించం గర్ణామృతమవయి గతియైతివిగా నాకుఁ గమలారమణా చ. చేరి నా కన్నులెదుట శృంగారరసమవై ఆరసి రక్షించఁ బితురార్జితమవై సారపు టిహపరాలు సంసారసుఖమవై యూలీత్రిఁ బెంచిత్రిగా నా కిందిరారమణా చ. తనువిచ్చి జీవునికిఁ దల్లి వి తండ్రివినై ధనమవై దాతవు దైవమవునై అనుఁగు శ్రీవేంకటేశ అంతరాత్మవు నీవై నను మన్నించితివిగా నారాయణా రేకు: 0186–02 గుండక్రియ సంపుటము: 02-433 పల్లవి: నేనేమిఁ జేయఁగలేను నీవు పరిపూర్జుఁడవు హీనుఁడ నే నధికుఁడ విన్నిటా నీవు చ. దండము వెట్టుట నాది తప్పులోఁగొనుట నీది నిండి నీవెప్పుడు దయానిధివి గాన అండఁ బేరుకొంట నాది అందుకు నూఁకొంట నీది దండియైన దేవదేవో త్తముఁడవు గాన చ. శరణు చొచ్చుట నాది సరుగఁ గాచుట నీది పరమ పురుష శ్రీపతివి నీవు