పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/731

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

729 కొట్టఁగొన కెక్కించుఁగోరి మొదలికి దించు మట్టులే దింతింతని మరియు నీమాయ చ. పలు లంపటాల ముంచు భావజుచే భ్రమయించు నిలిచిన చోటనెల్లా నీమాయ యెలమి శ్రీవేంకటేశ యిటు నిన్నుఁ గొలువఁగా మలసి సాలసి నన్ను మన్నించె నీమాయ పె.అ.రేకు:0053-03 ముఖారి సంపుటము: 15-301 పల్లవి: నేనిఁక వెఱపను నీవు నాకుఁ గలవు శ్రీనాథ ని న్నెట్రిఁగితి చేకొని రక్షింతువు చ. మొల్లమి నే నొకజన్మమున నిన్నుఁ గొలువఁగా తొల్లి జన్మము లెత్తిన దుఃఖము వాసె యిల్లిదే యీ దేహమున యిటు నీ యచ్చు మోపఁగా చిల్లరదేహములు మోచినచింత లుడిగె చ. యిల నిన్నొకనిమిష మిటు థ్యానము సేయఁగా గలిఁ బోయిన కాలము నష్టి దీరెను చలపట్టి నీ దాసులసహవాసము గల్లగా నల మాయలో నీఁదిన యల పెల్లఁ బొలిసె చ. కనుగొని వేడ్కతో నీ కన్నులెదుటఁ బడఁగా ఘననరక మOదిన కా(క మూనెను యెనలేక శ్రీవేంకటేశ నిన్నుఁ దలఁచగా వెనకటి యజ్ఞానపు వెగ టెల్లాఁ గడచె రేకు:0234-01 సాళంగనాట సంపుటము: 03-192 పల్లవి: నేనింత సేసినయట్టి నేరమి మరవవయ్య ఆనుకొని తాళ్లపాక అన్నమయ్యఁ జూచి చ. నావొళ్లియపరాధా లెన్నక నిన్ను సారెసారె వేవేలు దూరిత్రి విచారించక కావించి కన్నులలోని కళంకు దెలియలేక ఆవలఁ జందురు నలుపణఁకించినట్లు చ. పాయక నేఁ జేసినట్టి పాపము లెంచుకొనక ఆయాలు మోవనాడితి నదివో నిన్ను మాయల నాదేహమిది మలినమే తలఁచక చాయ లేదని యద్దము సారెఁ దోమినట్లు చ. మదమత్సరాలు నాలో మానకిట్టే వుండఁగాను అదియే నీచేఁతంటా నాడుకొందును యొదలో శ్రీవేంకటేశ యిరవై నీ వుండఁగాను వెదకి వెదకి నీకే వెట్టిగొన్నయట్లు పె.అ.రేకు:0073-06 రామక్రియ సంపుటము: 15-422 పల్లవి: నేనే తలఁచ నిన్ను నేరమి యేమి చెప్పేది శ్రీనాథ నన్నుఁ గృపసేసి వోర్చుకొనవే చ. పరగఁ గన్నులకు రెప్పలు దాపై వుండినట్టు దరిదాపై వున్నాఁడ వింతటా నాకు అరసి దేహానకు ముంజేయి అడ్డమై వున్నయట్టు వరుస నాకు సహాయమై వత్తువు నీవు చ. వీనులకు నెప్పుడు వినికే లంకై వున్నట్టు పూనుకొని చుట్టమవై పోషింతువు