పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/730

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

728 యొుంచి విభషణు కిటు లంక యొసగి కొంచని ప్రతాప కోదండరామా చ. నరకాసురు నటు నఱకి కామినుల సిరులఁ జెఱగొన్న శ్రీకృష్ణ పారిఁబొలి బలిచే భూదాన మడిగి సిరి నిటు గూడిన శ్రీవేంకటేశా రేకు: 0321-02 లలిత సంపుటము:04-119 పల్లవి: నేఁడుగాక దొరనైతి నేను నారాయణుఁ గొల్చి పోఁడిమి నాచార్యుని భోధవంకను చ. దీనవృత్తి నేఁ దిరుగని చోటేది నానాచంచలము నామనసు పూని నేఁగొనని భువిలోని రుచు లేవి హీనజన్మము లెత్తిన దీమేను చ. చేరి నేఁజేచేతఁ జేయనిపాప మేది ధారుణి మోపైన సంసారమునను ఆరయ మున్ను నేనాడని కల్లలేవి సారెకు నుదురుపాశీషణమునకు చ. సూటిదప్పక నేఁ జూడని చూపేది చేటులేని చిరకాల జీవుఁడనే చాటువ శ్రీవేంకటేశు శరణు చొరకతోల్లి బూటకము లెన్ని లేవు పొలయదు కాలము పె.అ.రేకు:0010-04 సాళంగనాటసంపుటము: 15-059 పల్లవి: నేఁడే హరిసేవ లయితే నిత్యభోగములు పోడిమి దెలుసుకోవో బుద్దెఱిఁగి జీవుఁడా చ. పక్కన మనసులోన పాలు దాగినటనే చక్కని మాయలలో సంసారభోగములు నిక్కి నిక్కి నీళ్లలో నీడ చూచనట్లానే దిక్కుల కర్మఫలము దిచ్చభోగములు చ. కన్నులు మూసి మదిలోఁగలలు గని నటూనే పన్ని లోకముల ప్రపంచభోగములు అన్నిటాఁ దెరలో బొమ్మలాట లాడినట్లానే నన్నల బుట్ట పెరిగే జన్మభోగములు చ. కడుఁ జందమామ గుటుకలు మింగినట్లానే తడవి మోహించు చిత్తజభోగములు యెడయక శ్రీవేంకటేశుఁడు గరుణించితే అడియాలపు టీవులు ఆత్మభోగములు రేకు:0293–05 రామక్రియ సంపుటము: 03-540 పల్లవి: నేనా గెలువలేను నీమాయ శ్రీనాథ నీవు సేసే చేఁతలే నీమాయ చ. తమకము గడు రేఁచు తలఁపు ఉఱూఁతలూఁచు నిమిష మూరకుండదు నీమాయ త్రిమిరము ಬುದ್ದಿ గప్ప తెఱవల వెంటఁ దిప్ప అమరి తోడునీడ ఆయఁబో నీమాయ చ. పట్టినందుకెల్లాఁదీసు పాపమే చవులు సేసు నిట్టి(ట్ట?) పిడిఁ బోనీదు నీమాయ