పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/735

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

733 మొదల నంతర్యామిమూర్తివంున నీకు పదవిమీర నదియే ప్రాణప్రతిష్ట చ. అక్కున శ్రీవేంకటాద్రి నలమేలుమంగఁ గూడి వొక్కటై వుండినదే నిత్యోత్సవము లెక్కలేని వరములు లీలతో మా కిచ్చితివి యిక్కడ నేపాదు మాయింట నుండవయ్య రేకు: 0273-06 మంగళకౌశిక సంపుటము: 03-423 పల్లవి: నేమెంత మూడులమైనా నీలవరుఁ డంతరాత్మ మా మనసు వెలితేల మంచిదౌఁ గాక చ. దైవము కృప గలితే తన కర్మా లడ్డమా ఆవేళ ఘనపుణ్యుఁడౌఁ గాక గోవిందుఁడు మన్నించితేఁ గొంచము దొడున్నదా కోవరపు సిరులంది కొన కెక్కుఁగాక చ. పరమాత్ముఁ డేలుకొంటే బంధములు గలవా తెరదీసినట్లానె తెగుఁ గాక హరి విజ్ఞానమిచ్చితే నడ్డము మాయలుండునా తొరలి జీవుఁడు మాయఁ దొలఁగుఁ గాక చ. శ్రీవేంకటేశ్వరు రూపు చిత్తములోఁ జిక్కితేను చావుఁబుట్టుగు లున్నవా జయమాఁ గాక కైవల్య మీతఁ డిచ్చితేఁ గడమలు గలవా కేవలపు జగమెల్లా గెలుపించుఁ గాక రేకు:0105-06 ముఖారి సంపుటము:02-030 పల్లవి: నేమే బ్రహ్మమనుకో నేరము నేము కామించిన స్వతంత్రము గడు లేదుగాన చ. క్షణములోపలనె సర్వజీవావస్థలూను గణుతించేవాఁ డొకఁడు గలఁడు వేరే అణుమహత్త్వములందు నంతర్యామైనవాని ప్రణుతించి దాసులమై బ్రదికేముగాని చ. పనిగొని యేలుటకు బ్రహ్మాది దేవతలఁ గనిపించేవాఁ డొకఁడు గలఁడు వేరే ననిచి సిరుల లక్ష్మీనాథుఁడైనవానిపనులవారము నేము బ్రదికేముగాని చ. సతతరక్షకుఁడయి శంఖచక్రధరుఁడయి గతి శ్రీవేంకటపతి గలఁడు వేరే అతనిమఱఁగు చొచ్చి యానందపరవశానఁ නූෂීෂීජ කොටස්වභී හූඩ්ෂීයා CER) పె.అ.రేకు:0062-01 సాళంగనాటసంపుటము: 15-352 పల్లవి: నేర మెల్లా నాదే కాక నీకుఁ గడము వున్నదా సారె నమ్మితే రక్షించఁ జాలుదువు మఱి యేలుదువు గాకా చ. నీ వెత్తిన వెట్టి మోపునే నడవిఁ బార వేసి వేవేలు విన్నవించినా విందువా కా దందువు గాక కావించి నీవు చెప్పిన కర్మఫలము నీ కిచ్చి యేవి ని న్నడిగినా నీ విత్తువు మఱి మెత్తువు గాక చ. చెలఁగి నీవు నియమించిన యానాజ్ఞ దొర్చీ కొలువుకు వచ్చితేఁ జేకొందువా పొ మ్మందువు గాకా