పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/724

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

722 వాడికె సుగ్రీవుమేలు వాలికి గండాన వచ్చె యీడుగాని రాచపుట్టు యెట్టు నమ్మవచ్చును చ. వుమ్మడిఁ గోఁతులకూట ముదధికిఁ గట్లు వచ్చె తమ్మునిబుద్ధి రావణుతల వోయను పమ్మిశ్రీవేంకటేశుని పట్టానకే యింతానాయ యిమ్ముల నిట్టిదేవరనెట్టు నమ్మవచ్చును చి.ఆ.రేకు:0009-06 మాళవి సంపుటము: 10-054 పల్లవి: నూరవద్దు తాగవద్దు నోరు చేఁదుగావద్దు చేరువ నొకచోట సంజీవి వున్న దిదివో చ. పొలమెల్లాఁ దిరిగాడి పొడిఁబడనెవద్దు తలఁకక గడ్డపారం దవ్వవద్దు వలవని వాఁగుల వంకల వెదకవద్దు చెలఁగి వొకచోటసంజీవి వున్న దిదివో చ. మొక్కలానఁ జెరువులో మునిఁగి చూడవద్దు నిక్కిన పుట్టలమీఁద నెమకవద్దు వెక్కసానఁ జేతిపైఁడి వెలవెట్టి కొనవద్దు చిక్కులెల్లా బాపెటిసంజీవి వున్నదిదివో చ. దీవులను నోడలెక్కి తిరుగాడనేవద్దు సోవల బిలములోనఁ జొరవద్దు కావించి గ్రహణాదికాలము వెదకవద్దు శ్రీవెంకటనాథుడైసంజీవి వున్నదిదివో రేకు: 0159-01 రామక్రియ సంపుటము: 02-282 పల్లవి: నెట్టన శ్రీసతిమగనికి శరణు దిట్టయై సర్వేశుఁడైన దేవునికి శరణు చ. చెలఁగి జగత్తులకు జీవులకుఁ బ్రాణమై నెలవై వుండేయూతనికి శరణు తెలివై మఱపై దేహాలలో సూత్రమై వలనై రక్షించేయట్టివానికి శరణు చ. చక్కగా వేదములకు సకలశాస్త్రములకు నెక్కొని గుఱుతైనవానికి శరణు దిక్కుదెసయి స్వతంత్రుఁడయి తేరిన ఆదిమూలమై అక్కజపు మహిమల యాతనికి శరణు చ. యిరవుగఁ గరుణించి యిహపరాలొసగేటి నిరతి శ్రీవేంకటేశునికి శరణు గురువై తల్లిదండ్రియెగుణము సుజ్ఞానములెరవులేక యిచ్చేటి యీతనికి శరణు పె.అ.రేకు:0062-04 బౌళి సంపుటము: 15-355 పల్లవి: నెట్టున నంతమాత్రాన నీ వాఁడె వాఁడు ಯೆನ್ಜಿನ್ గావకపారీదు యినా సంబధమునను చ. చిలుకను రామ తమ్మా పలుకు మను నొక్కఁడు పిలుచుఁ దిమ్మా యని నీ పేరిటివాని నొక్కఁడు వెలయ గోవిందా యని వెఱగువడు నొక్కఁడు అలసినవేళ హరి హరి యను నొక్కఁడు చ. సింగారానకు నొక్కఁడు చిన్ని తిరుమణి వెట్టు వెంగొంగ నామము వెట్టు వెక్కిరింపుచు నొక్కఁడు