పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/725

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

723 పంగనామముగఁ బెట్టు బహురూపగాఁడొక్కఁడు సంగాతాలకుఁ బెట్టు వేసాల నామ మొక్కఁడు చ. సరుగ నీ గుడిలోన సాగిలి పండు నొక్కఁడు వరుస నూరకే తల వంచు సారె నొక్కఁడు యిరవై శ్రీవేంకటేశ యిన్నీ నీ మొక్కులుగానే అరసి చేకొందువు నీ వంత సులభుఁడవు రేకు:0132-04 సామంతం సంపుటము: 02-130 పల్లవి: నెప్పున ధర్మపుణ్యము నీచేతి దింతే యెప్పుడు గాచినఁ గావు మింతా నీచిత్తము చ. యేవల నరుఁడు లేక యెద్దే తా దున్నునా నీవు సేయించక వేరే నేఁ బుణ్యము సేసేనా దేవుఁడ సూర్యుఁడు రాక తెల్లవారునా రేయి వేవేగ నీకృపఁగాక విజ్ఞానినౌదునా చ. కుమ్మరవాఁడు లేకే కుండ రాఁ బుట్టునా నెమ్మి నీవు పుట్టించక నేనే పుట్టితినా వమ్ముల రాట్నము నిలువక గుండ్రలు నిల్చునా పమ్మి నీయప్పణ లేక భవములు మానునా చ. మక్కువ మగఁడులేని మనువు గలుగునా లెక్కించి యంతర్యామివి లేని నే నున్నాఁడనా చక్కఁగ శ్రీవేంకటేశ శరణనే బుద్ధి నాకు తక్కక నీవియ్యకుంటే దాసుడనే నౌదునా పె.అ.రేకు:0016-03 సాళంగనాట సంపుటము: 15-089 పల్లవి: నెమ్మది నిన్నే గొలిచి నిశ్చింతులమె కాక దొమ్మిఁ దొంటి చేతకంటు దొడ్డాయితి చ. శ్రీపతి నీనామ ముచ్చరించి కృతార్టులై సర్వ పాపవిముక్తులైనట్టి ప్రపన్నులకు యేపునఁ గాల దోషములేవి కర్మదోషమేది కోపుల లోకముల శకునదోషము లేవి చ. నారాయణ నీదాసులై నరకము లుత్తరించి వైరములు దాఁటిన శ్రీవైష్ణువులకు యిూరీతి మంత్రలోపము లేవి క్రియాలోపమేది భారమైన ఆచారలోపము మరేది చ. మించి శ్రీ వేంకటేశ్వర మిమ్ముఁ గొల్చి భవములు తెంచిన శరణాగత దేహులకు యెంచి చూడ మాయ లేని యిలఁ గనిబాధ లేని అంచల నెందుచూచిన అడ్డాఁక ලීඩ් రేకు: 9111-01 ముఖారి సంపుటము: 04-598 పల్లవి: నెరబిరుదిన్నిటాను నీ బంటు వొరసె గగనమదివో నీ బంటు చ. ముంచిన చుక్కలు మొలపూసలుగాఁ బెంచె మేను పెళపెళనార్చి అంచులు మోవఁగ నబ్జభవాండము నించె నార్చటము నీ బంటు చ. గగనలోకములు గడగడ వణఁకఁగ నెగసె హుటాహుటి నీ బంటు