పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/723

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

721 చ. లోకము లేలుదువట లోకము లోపలి నేను పైకొని నీవేలినట్టి బంటనే సుమ్మీ ఆకడ నావుఁ గొంటే నావువెంట దూడయును జోకలఁ గొన్నట్టివారి సామ్మే కాదా చ. చేరి నన్ను నీవే పుట్టించితివట నేఁ జేసేమేరతోఁ బుణ్యపాపాలు మీవే సుమ్మీ ఆరుగ విత్తినవాఁడు ఆరుగలోపలి కంది ఆరితేరి పండితేను ఆతనిదే కాదా చ. శ్రీవేంకటేశ నీవు జీవాంతరాత్మవట కావించి నాపాలఁ గలవే సుమ్మీ కైవసమై చందురుఁడు కలువలజాతికెల్ల భావింప సర్వవిధబంధువే కాఁడా పె.అ.రేకు : 0036-04 దేపాళం సంపుటము: 15-204 పల్లవి: నుంచి వయసుకాలము మాయతో నేమరి వుండి పంచేంద్రియసుఖము పాలాయె బ్రదుకు చ. ముదిసే కాలమునాఁడు మోక్షము సాధించే నంటా మదించి నూరేండ్ల ముది మది దప్పును కదలలే కంతటను కన్నుల పొరలు గప్పి అదెవ్వరిదెవ్వరంటా నడుగుచు నుండును చ. జవ్వనపాయము వోఁగా సన్యాసి నయ్యే నంటాను నవ్వుతానే నరసి వణఁకఁ జొచ్చును చివ్వన నెముక వంగి చేత నూతకోల పట్టి వువ్విళూర నెంగిలిలో నోలలాఁడఁ జొచ్చును చ. యింక మీఁదట శ్రీ వేంకటేశ్వరు సేవించే నంటా సంకె లేక వుండఁగాను సత్వవోవును అంకెల వీఁడు వెట్టియైనా నంతరాత్మగాన మంకు దేర నీమాటకే మంచిగతి వెట్టును రేకు:0102-02 సామంతం సంపుటము: 02-008 పల్లవి: నూఁతులు దవ్వఁగఁబోతే బేతాళములు వుట్టె కాఁతాళపు లోకులాల కంటిరా యీసుద్దులు చ. మీఱిన పుత్రకామేష్టి మించి లంకకుఁ బైవచ్చె ఆఱడి రామావతార మసురబాధ తూటి సీతపెండ్లి హరుదొడ్డ వింటిపండుగాయ పాటి పాటి నమ్మ నెటువలెవచ్చు వీరిని చ. చూడ కేకయరాజ్యము చుప్పనాతిపాపమాయ వేడుక మాయమృగము వేఁటాయను