పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/722

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

720 చ. పరమపద మొసంగి పాపమడంచేనని చరమశోకమునందు చాటితివి తొలుతనె నిరతిని భూమిలోన నీవల్లఁ దప్పు లేదు పరగ నమ్మనివారిపాప మింతేకాని చ. నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని యేపున ద్వయార్ధమున నియ్యకొంటివి తొలుత దాపుగా నీవల్ల నింకఁ దప్పు లేదు యెంచిచూచి పైపై నమ్మనివారిపాప మింతే కాని చ. బంతిఁ బురాణములను భక్తసులభుఁడ నని అంతరాత్మ వీమాట అడితివి తొలుతనే ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు పంతాన నమ్మనివారిపాప మింతేకాని రేకు:0236-02 దేసాక్షి సంపుటము: 03-205 పల్లవి: నీవొక్కఁడవే యిత్తువు నిన్నుఁ గొల్చినవారికి శ్రీవల్లభుఁడవు రక్షించవే నారాయణా చ. పెక్కుజీవులు భువినిఁ బెరిగేరు మోక్షము వొక్కరునుఁ దెచ్చి యియ్యనోప రెవ్వరు అక్కజపుధనరాసు లంగళ్లలోనున్నవి గక్కనఁ గొనేమంటే మోక్షము గొనరాదు చ. వున్నవి పుణ్యకర్మాలు వొడ్డి యందే మోక్షము మిన్నక యొక్కేమంటే మెట్లు గావు యెన్నఁగ సంసారధర్మమిదివో మోక్షము చూప చన్నమన్నవారికెల్లా సాధనము గాదు చ. పదునాలులోకములు పన్నివున్నవి మోక్షము తుదకెక్కించ నవైనాఁ దోడుగావు యిదివో శ్రీవేంకటేశ యిహపరము లొసఁగి హృదయములో నున్నాఁడ వింకనేల చింత రేకు:0239-01 బౌళి సంపుటము: 03-222 పల్లవి: నీవొక్కఁడవే సర్వాధారము నిన్నే యెరిఁగిన నన్నియు నెఱుఁగుట భావించి యింతయుఁ దెలియఁగ వలసిన బ్రహ్మవేత్తలకు నిది దెరువు చ. నీయందె బ్రహ్మయు రుద్రుఁడు నింద్రుఁడు నీయందె దిక్పాలకులు నీయందె మనువులు వసువులు రుషులు నీయందె విశ్వాఖ్యదేవతలు నీయందె వురగులు యక్షరాక్షసులు నీయందె గరుఁడగంధర్వులు నీయందె పితరలు సిద్ధసాధ్యులు నీయందె ద్వాదశాదిత్యులు చ. నీవలననె కిన్నరకింపురుషులు నీవలననె విద్యాధరులు నీవలననె యచ్చరలు చారణులు నీవలననె నక్షత్రములు నీవలననె గ్రహములు చంద్రుఁడును నీవలన(నె?) నభోంతరిక్షములు నీవలననె జలధులు పవమానుఁడు నీవలననె గిరులును భూమియును చ. నీలోననె నదులును నగ్నియు నీలోననె సచరాచరములును నీలోననె వేదశాస్త్రము మొదలుగ నిఖిలశబ్దమయము నీలోననె అన్నియు నిన్నర్చించిన నిఖిలతృప్తికరము శ్రీలలనాధిప శ్రీవేంకటేశ్వర శ్రీవైష్ణవులకు నిది మతము రేకు:0187-04 సామంతం సంపుటము: 02-441 పల్లవి: నీసొమ్ము చెడకుండ నీవు చూచుకొనవయ్య దాసుఁడ నేనింతే దైవమవు నీవు