పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/721

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

719 చ. అలుబిడ్డలఁ గని యటు దనమగనికి సీలాన సమర్పణ సేయవలెనటవయ్యా తాలిమిఁ బుణ్యాలు సేసి దైవమా నే నీకు యేలీల సమర్పించే నిందుకే నవ్వు వచ్చీనయ్యా చ. అంకెలఁ గన్నకొడు కటు దమతండ్రికిని తెంకి నే నీవాఁడ నని తెలుపఁగవలెనటవయ్యా e)OS నాలోపలనున్నలక్షీశ నే నీకు పొంకపు నీబంట నన్నఁ బునరుక్తయిన్యానయ్యా చ. తననీడ యద్దములోఁ దానేయటు చూచి పనివడి వూరకే భ్రమయవలెనటయ్యా అనుగు శ్రీవేంకటేశ ఆతుమలోనున్న నిన్ను గని మని శరణంటిఁ గడఁ బూజించనేలయ్యా రేకు:0042-01 లలిత సంపుటము: 01-255 పల్లవి: నీవేకా చెప్పఁజూప నీవె నీవెకా శ్రీ విభుప్రతినిధివి సేన మొదలారి చ. నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద దేవతలఁ గనిపించే దేవుఁడవు యేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజసేవకుఁడవు నీవెకా సేనమొదలారి చ. పసిఁడి బద్దలవారు పదిగోట్లు గొలువ దెసలఁ బంపులువంపే దీరుఁడవు వసముగా ముజ్జగాలవారి నిందరిని నీసిసువులఁగా నేలిన సేనమొదలారి చ. దొరలై నయసురుల తుత్తుమురు సేసి జగ మిరవుగా నేలితి వేకరాజ్యమై పరగుసూత్రవతీ పతివై వేంకటవిభుసిరుల పెన్నిధి నీవే సేనమొదలారి రేకు:0003-04 శ్రీరాగం సంపుటము: 01-017 పల్లవి: నీవేకానింక నే నన్య మొఱఁగ యే త్రోవ చూపి నాకుఁ దోడయ్యెదవయ్య చ. అపరాధనత కోట్లయినవి వొక్కనెపమున ననుఁ గావనేరవా అపరిమితదురితా లైనవి యేఉపమచేత నన్ను నుద్దరించెదవయ్య చ. అతిశయముగఁ గర్మినైతిని నీ మతము నాకొకయిOత మరపవా ఇతర కర్మారంభహితుఁడను గతి మోక్ష మొటువలెఁ గల్పించెదవయ్య చ. తిరువేంకటాచలాధీశ్వరా నీశరణాగతులఁ బ్రోవఁజాలవా పరమదయానందపరుఁడవు యేవెరవున భవములు వెడలఁ ద్రోచెదవయ్య రేకు:0097-05 భైరవి సంపుటము: 01-487 పల్లవి: నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు భావించలేనివారిపాప మింతేకాని