పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/720

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

718 చ. హరి నిన్ను నమ్మితి నే నననెట్టు వచ్చు నాకు ఇరవైన బుద్ధి నా ఇచ్చగాదు వెరవున నొకటి నే విన్నవించెదనంటేను సరి నీవు వెలిగాను స్వతంత్రుఁడఁగాను చ. యిట్టె నీపై భారము నే నెట్టు వేయఁగవచ్చు పట్టి నీకుఁ బురుషార్థపరుఁడఁగాను గుట్టుతోడ నే నిన్నుఁ గొలువఁగఁ గొలువఁగ ಯೆಣ್ಣನ್ గానిమ్ము యొరఁగ నెవ్వరిని చ. యింతటి దైవమవు ని న్నిఁక నెందు వెదకేను చెంత శరణాగతుల చేతివాఁడవు వింతగాదు నీకును శ్రీవేంకటేశ నాకును అంతర్యామివి నీయానతిలో వాఁడను రేకు:0197-05 దేసాళం సంపుటము:02-500 పల్లవి: నీవే రక్షింతువుగాక నిన్ను నమ్మితిమి నేము దైవమవై నీ వుండఁగ తగ మాదే బ్రదుకు చ. కోరి వొకరాతివీరుఁ గొల్చి బతికీ నొకఁడు పైరు వొక్కచెట్టవెట్టి బతికేననీ నొకఁడు కూరిమిఁ బాము చేబట్టుకొని బతికీ నొకఁడు శ్రీరమణుని దాసుల చేతిదేపాశీ భాగ్యము చ. ఇసుమంత మన్ను వట్టి యేచి బతికీ నొకఁడు పసురము నింటఁ గట్టి బతికేననీ నొకఁడు పసగా వేలె డినుము పట్టి బతికీ నొకఁడు వసుధేశ నీవు గలవారి కేమి గడమ చ. ఆకునలముఁ గసవునంటి బతికీ నొకఁడు లోకులు పెక్కుపాయాల లోలులై బతికే రదే యిూకడ శ్రీవేంకటేశ ఇవెల్లా నీమహిమలే చేకొని నీమరఁగు చొచ్చినవారే ఘనులు పె.అ.రేకు:0064-04 శ్రీరాగం సంపుటము: 15-367 పల్లవి: నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువు గాక మాకు భావించి నిన్ను రూపించి పట్ట నెట్ట వచ్చును చ. పాలజలనిధిలోన పండేది నీ కొకచోటు వోలి జీవులలో నెల్లా వుండేది నీ కొకచోటు తేలగిల సూర్యునిలో తిమ్మట నీ కొకచోటు తాలిమి ని న్నెందని వెదకఁ గల మిఁకను చ. అనలునిలోపల నారగించే దొకచేటు గొనకొని వైకుంఠానఁ గొలువుండేదొక చోటు పానుఁగక దాసులిండ్లఁ బూజఁగొనే దొకచోటు ఘనుఁడ నిన్ను సోదించి కన నెట్టు వచ్చును చ. రతిఁ దులసివనాన రచ్చ సేసే దొకచోటు కతలుగా లక్షితోడ కాఁపురము లొకచోటు తతి శ్రీవేంకటాద్రిపై దగఁ గాణా చొకచోటు యితవుగా నీ చొప్ప లెత్తఁగ మాతరమా రేకు: 0188-01 గుండక్రియ సంపుటము: 02-444 పల్లవి: నీవే సేసిన చేఁత నీవే చేకొనుటింతే యీవల నీసొమ్ము నీకే ఇయ్య సిగ్గయ్యీనయ్యా