పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/719

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

717 చ. నెట్టన సూర్యులోని నెలకొన్న తేజమా గట్టిగాఁ జంద్రునిలోని కాంతిపుంజమా పుట్టిరక్షించే యజ్ఞపురుషుని ప్రకాశమా వొట్టుక దేవతలలోనుండిన శక్తీ చ. సిరులుమించిన యట్టిజీవులలో ప్రాణమా గరిమ వేదములలోఁ గల యర్ధమా పరమపదమునందుఁ బాదుకొన్న బ్రహ్మమా చరాచరములలో సర్వాధారమా చ. జగములో వెలిసేటిసంసారసుఖమా నిగిడినమంత్రముల నిజమహిమా మిగుల శ్రీవేంకటాద్రిమీఁదనున్నదైవమా ముగురువేల్పులలోని మూలకందమా రేకు:0179-03 సాళంగం సంపుటము: 02-394 పల్లవి: నీవే మూలమువో నేరిచిన పెద్దలకు దేవుఁడు నీయందులోనే తిరమాయ నిదివో చ. బాపురే వో దేహమా బాపురే వో నీవు వోపి నేఁ బెట్టినకొద్ది నుందువుగా రూపు నీవు గలిగితే రుచులెల్లఁ గానఁ గద్దు చాపలాన ధర్మములు సాధింపఁగలదు చ. మెచ్చితి నోమనసా మెచ్చితివో నీవూ నాయిచ్చకొలది నెందైనా నేఁగుదువు గా అచ్చపు నీకతమున నవుఁగాము లెంచఁ గద్దు పచ్చిగా యేముర్తినైనా భావించఁగలదు చ. మేలు మేలు నాలికె మేలు మేలు నీవు వోలి యేమాటకునైనా నొనరుదుగా చాలి నీవు మెలఁగంగ చదువు చదువఁ గద్దు పాశీలించి శ్రీవేంకటేశుఁ బొగడఁగఁగలదు రేకు: 0300-02 లలిత సంపుటము: 03-579 పల్లవి: నీవే యంతర్యామివి నీ వున్నదే వైకుంఠము ఆవలC బరమపదమున నిOకాఁ గలదా చ. యిందరు జంతువులు నీ విచ్చిన రూపులు మోచి బొందితో నీకే నెలవై పుట్టినారు కందువ నీ ప్రపంచపు కైంకర్యములు సేసి అందిరి జీవన్ముక్తులదివో చాలదా చ. యేలిక వంచిన పనే యింద్రియభోగములెల్ల తోలితోలి రాచాజ్ఞ తోయకున్నారు కాలము నిన్నుఁ బాయరు గర్భగోళమం దున్నారు యీ లోకమే సాలోక్యమిది యింత చాలదా చ. జ్ఞానము నజ్ఞానమేది స్వామికార్యములోన మానక నీ పనులలో మత్తులైనారు శ్రీనాథుఁడవు నీవే శ్రీవేంకటేశ్వర నీ నాటకములోనే నిత్యులైరి చాలదా రేకు:0233-03 గుండక్రియ సంపుటము: 03-188 పల్లవి: నీవే యెరిఁగి సేయు నీ చిత్తము వచ్చినట్టు తావులఁ గొసరేనన్నా తనివోదు నాకు