పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/718

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

716 చ. నీదాసుల శిరసులే నీదివ్యశిరసులు నీదాసులపాదములే నీదివ్యపాదములు నీదాసులకన్నులే నీదివ్యనేత్రములు నీదాసులరూపమే నీవిశ్వరూపము చ. నీకింకరులగుణాలే నీదివ్యగుణములు నీకింకరులున్నచోటే నీకు నిత్యవైకుంఠము నీకింకరుల సేవే నీవు మెచ్చునిజసేవ నీకింకరుల కూటమే నీకు సర్వాంగములు చ. యిందరిలో శ్రీవేంకటేశ నీవే పాణి యంటే అంది తల్లిముట్టే యుంటే నంటవచ్చునా యెందు నజ్ఞానపు ముట్టు యొడసినాత్మలుగాన నిందలేని నీదాసులే నీవని సేవింతును రేకు:0209-01 దేసాక్షి సంపుటము: 03-049 పల్లవి: నీవే నేరవుగాని నిన్నుఁ బండించేము నేము దైవమా నీకంటే నీదాసులే నేర్పరులు చ. వట్టి భక్తి నీ మీఁద వళుకువేసి నిన్నుఁ బట్టి తెచ్చి మతిలోనఁ బెట్టుకొంటిని పట్టెడు దులసి నీపాదములపై బెట్టి జట్టిగొనిరి మోక్షము జాణలు నీదాసులు చ. నీవు నిర్మించినవే నీకే సమర్పణసేసి సాశీవల నీకృపయోల్లఁ జూరగొంటిమి భావించొకమొక్కు మొక్కిభారము నీపై వేసిరి పావనపు నీదాసులే పంతపు చతురులు చ. చెరువుల నీళుడెచ్చి చేరఁ(రె?డు నీపైఁ జల్లి వరము వడసితిమి వలసినట్టు యిరవై శ్రీవేంకటేశ యిటువంటి విద్యలనే దరిచేరి మించిరి నీదాసులే పాశీ ఘనులు పె.అ.రేకు: 0031-04 శంకరాభరణం సంపుటము: 15-174 పల్లవి: నీవే బోధించి నన్ను నీవే యీడేరు గాక నావంక నేమి గలరు నమో నారాయణా చ. పంచిన నా కర్మములు పనులే బోధించుఁ గాక పొంచిన శ్రీహరి నిన్ను బోధించీనా తెంచరాని ఆసలివి తిమ్మటే బోధించుఁ గాక కంచపు నీ దివ్యనామకతలు బోధించీనా చ. పొరలు యింద్రియములు భోగమే భోధించుఁ గాక పురుషోత్తముఁడ నిన్ను బోధీంచీనా సరుస నా యూకలిది చవులే బోదించుఁ గాక నిరతి నీ కైంకర్యము నేఁడు బోధించీనా చ. గాసిల్ల నామతి యహంకారమే భోధించుఁ గాక భూసతీశ నిన్నుఁ గాన బోధించీనా యీసుదీర శ్రీ వేంకటేశ నీకు నా గురుఁడు దాసి బోధించుఁ గాక తప్పఁగా బోధించునా రేకు: 0168-02 ధన్నాసి సంపుటము: 02-329 పల్లవి: నీవే మాకు దిక్కు నిన్నే తలఁతుము కావు మా నేరమెంచక కరుణానిధీ