పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/717

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

715 చ. మొదల నాశక్తి యిమ్ములఁ బరీక్షించి మరి చెదర కిటు రక్షించెద నంటివా అదె యశక్తుఁడ నేను అజాగళస్తనము అదియె పనికివచ్చు నంతియె నేను చ. పలు నా స్వరూప స్వభావంబు లెఱిఁగి మరి చెలఁగి నను రక్షించెద నంటివా వెలిఁ గప్ప చిప్పందు వెండిభావన మించు కలిగినంతే నా కల గుణంబు చ. శ్రీ వేంకటేశ నీ సేవ సేయఁగ మరి జీవంబు నేలి పెంచెద నంటివా మోపకె గోపురము మోచే ప్రతిమరీతి తావులను నా స్వతంత్రము నిట్టిదే రేకు:0236-04 దేవగాంధారి సంపుటము: 03-207 పల్లవి: నీవే నన్ను దయఁ గావు నీవు స్వతంత్రుఁడవు జీవుఁడ నింతే నేను శ్రీమన్నారాయణా చ. నిను నామనసుఁ గొని నేఁ దలఁచేనంటినా మన ప్రకృతిఁ బుట్టె మరి నిన్నెట్టు దలఁచీ తనువుఁ గొని నీసేవ తగిలి సేసేనంటినా తనువు కర్మాధీనము తగిలీనా నిన్నును చ. గరిమ నర్థమిచ్చి నీగతి గనేనంటినా హిరణ్య మజ్ఞానమూల మెట్టు నీకు నియ్యనిచ్చీ సిరుల నాజన్మము నీ సెలవు సేసేనంటినా సరిఁ బుట్టుగు సంసారసాధ్యము నిన్నంటీనా చ. యిలఁ బుణ్యఫలము నీకిచ్చి మెప్పించేనంటినా ఫలము బంధమూల మేర్పడనియ్యునిచ్చీనా నిలిచి శ్రీవేంకటేశ నే నీశరణు చొచ్చితి యెలమి నీకరుణ నన్నెడయనిచ్చీనా పె.అ.రేకు:0051-03 పాడి సంపుటము: 15-289 పల్లవి: నీవే నియామకుఁడవు నీవుదయానిధివి జీవులకు స్వతంత్ర మిచ్చితి విందుకొరకా చ. అసురులకుఁ బాపము అమరులకుఁ బుణ్యము పసగానే పంచిపెట్టి పనిగొనేవు వసుధ నీ లీల కింతవలెనా తొల్లేకర్మము పాసగ మంచిదిగానే బుద్ధి పుట్టించరాదా చ. కౌరవులకు నోటమి కౌంతేయులకు జయము యేరుపరచి చూచితివి యిరుదెసలా సారెకు భూభారము దించఁగ నింత్రవలెనా పోరు లేనివారినే పుట్టించరాదా చ. జడుల కజ్ఞానము సజ్జనులకు విజ్ఞానము అదరించి యేలితివి యందు నిందును బడి శ్రీవేంకటేశ పాపపణ్యముల కింతేల కడకూ మంచిదిగానే కరుణించరాదా రేకు: 0317-03 బౌళి సంపుటము: 04-098 పల్లవి: నీవే నీదాసులని నినుగంటిఁ గంటిని ఆవలనీవే అంతర్యామివి గాన