పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/716

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

714 చ. పాందుగాని గొల్లెతల పొందు నీవు సేసితేను నింద రాక మానునా నీకైనాను అందముగ నిన్ను వారియంగములు సోఁకితేను విందువలె గొల్లముంజ వేయకుండీనా చ. కూడగొట్టు వనితల కోరి పెండ్లాడితేను ఆడుకోకుండుదురా అంగళ్ల నెల్ల ఆడవారు తమతమ అధరములు మోవీఁగా యినాడులేని నీ మోవి యెంగిలి గాకుండునా చ. యియ్యని రాచకూఁతు నెత్తుకొని వచ్చితేను నెయ్యపు శ్రీవేంకటేశ నిన్ను నవ్వరా యియ్యోడ నన్నుఁ గూడే వీపె నింత సేసితేను వుయ్యాలగా రొమ్ముదొక్కి వుండ కిట్టే మానునా రేకు:0169-04 ధన్నాసి సంపుటము:02-336 పల్లవి: నీవే దయదలఁచుక నెమ్మి రక్షించుట గాక యీవలఁ గొలిచేనంటే యీడైనవాఁడనా చ. పరగ నేమైనా విన్నపము చేసుకొనేనంటే హరి నీకు నెదురుమాఁటాడేవాఁడనా గరిమ సువస్తువులు కానుక ఇచ్చేనంటే సరుస నీకన్నా నేను సంపన్నుఁడనా చ. మెలఁగి నీగుణాలకు మెచ్చి సంతోషించేనంటే జలజాక్ష నే నీతో సరివాఁడనా బలువైనా నీపరమపదము గోరేనంటే వలనైన నీతోడివంతువాఁడనా చ. తాలిమితో నాలో నిన్ను ధ్యానము సేసేకంటే పాలఁసుడ నేను నీపాటివాఁడనా యేలితివి శ్రీవేంకటేశ నన్నుఁ గృపతోడ యీలీల నీమహిమలు యెరిఁగేటివాఁడనా రేకు: 0343-04 ధన్నాసి సంపుటము:04-253 పల్లవి: నీవే దయసేసి నేఁడు మమ్ముఁ గాతుగాక శ్రీవల్లభుఁడ నీకు సేవ సేసే వారమా చ. యిదిపుణ్య మిది పాప మెట్టని తెలిసేమయ్య అదన నన్నపు నామే యన్నువట్టెను యిదెదైవ మిదెగురుఁ డెట్టని యెరిఁగేమయ్య మొుదల నానాయోనిముట్టంటువారము చ. ఆచారమేది యిఁక ననాచారమేదయ్య కాచినయూఁకటికరిగాపులము యేచినబంద మిది మోక్షమిది యనలేమయ్య పూచినపంచేంద్రియాలపారుగైతి మిదివో చ. ముందరిది వెన కిది ముట్టి యేమనెంచేమయ్య కందువసంసారపుగర్వ మెక్కెను అందపు శ్రీవేంకటేశ యన్నియు నీమాయ లివి పొంది నీకొప్పనసేసి భోగించేమయ్య పె.అ.రేకు: 0036–02 మలహరి సంపుటము: 15-202 పల్లవి: నీవే ననుఁ గరుణింతువు గాక వేవేలకును నాకు విన్నపం బిదియే