పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/715

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

713 చ. యేఁటి పురాకృత మెక్కడి కర్మము దాఁటక హరి నీ దయ గలిగిశే నీటున నిన్నియు నీ కల్పితములు పాటించి నీవే పాపంగలేవా చ. యొక్కడి జన్మము లెక్కడి మరణము లొక్కఁడవె నీవు వొద్దంటే యొక్కువ నిందరి నేలెటివాఁడవు యిక్కడఁ గొలిచితి మితరము లేలా చ. యేది పాపము యేది పుణ్యము పోదిగ నీవే పొమ్మంటే చేదో డిందుకు శ్రీవేంకటేశ్వర ఆదె నిను శరణంటిమి గోరెంత్ర రేకు: 0359-01 లలిత సంపుటము:04-345 పల్లవి: నీవే కాచుటగాక నేరుపు నాయందేది చేవల వేఁపమాను చేఁదు మానీనా చ. వొరసి దురుణములనుమానిన నాచిత్తము మరలి మంచిగుణాన ముట్టుపడీనా హరి నిన్నుఁ దలఁచక యడవిఁబడిన మరి (తి?) దరిచేరి నిన్ను మతిఁ దలఁచఁబోయీనా చ. పాలుమాలి యింద్రియాల బారిఁబడ్డ పుట్టువిది ఆలరి వైరాగ్యసుఖ మందఁబోయీనా నీలవర్ణ నినుమాని నిత్యసంసారైన నేను కాలమందే నిన్నెరఁగఁ గలనా నేను చ. గరిమ సుజ్ఞానము గలిగిన సాత్విక - మరయ వేరొకచోట వణఁగీనా యిరవై శ్రీవేంకటేశుఁడ నీకరుణబ్బె శరణాగతుఁడ నాకు స్వతంత్రమూ పె.అ.రేకు:0001-02 గుండక్రియ సంపుటము: 15-002 పల్లవి: నీవే ఘనుఁడవు నేనొక దేహిని యేవలఁ గాచుట యెన్నిక నీకు చ. మొక్కినఁ దీరును మోచిన తప్పులు, అని మొక్కెద నీ పాదములకు నిదే చిక్కినవారిపై చేరి దయ గలుగు, అని చిక్కితి నిటు నీ చేతికి నేను చ. చెప్పినఁ బాయును నేసిన పాపము, అని చెప్పెద నా దుష్టచేత లివే యెప్పుడు చనవరి యెంగిలి దిన్నను చిప్పిలుఁ బ్రసాద జీవిని నేను చ. కొలిచిన పతి చేకొని రక్షించును అని కొలిచిత్రి నీ డాగులు మోచి యెలమి శ్రీవేంకటేశ్వర నే నీకు బలువగు సూత్రపు ప్రతిమను నేను పె.అ.రేకు : 0031–02 ముఖారి సంపుటము: 15-172 పల్లవి: నీవే తెలుసు కొమ్మీ నీ సుద్దులు రావిచిగురంటుకొంటే రాఁ బోను వచ్చునా