పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/714

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

712 చ. పూవులపైఁ గాసీఁ బొరి ముండ్లపైఁ గాసీని ఆవల వెన్నెలకేమి హానివచ్చీనా పావనుల నటు గాచి పాపపుంజమైన నన్నుఁ గావఁగా నీకృపకునుఁ గడమయిన్యానా చ. గోపుమీఁద విసరీఁ గుక్కమీఁద విసరీని పావనపు గాలికిని పాపమంటీనా దేవతల రక్షించి దీనుఁడనైన నాకుఁ దోవచూపి రక్షించితే దోసమయ్యీనా చ. కులజుని యింటనుండీ కులహీనుని యింటనుండీ యిలలో నెండకు నేమి హీనమయిన్యానా వలసి శ్రీవేంకటాద్రి వరములు యిచ్చి నాలో నిలిచి వరములిచ్చి నేఁడు గావవే చి.ఆ.రేకు:0008-04 రామక్రియ సంపుటము: 10-046 పల్లవి: నీవుగలిగినఁ జాలు నిక్కము అన్నీఁ గలవు ఆవల మాయాచార్యుఁ డానతిచ్చెనయ్యా చ. యేలోకముననున్న యెడయనిసామ్ము నీవె తాలిమి యెందుఁ బోనిధనము నీవె కాలముకడాతరగని ధాన్యము నీవని ఆలించి మాగురుఁడిట్టె ఆనతిచ్చెనయ్యా చ. యెందెందుం దిరిగిన యేలికవు నీవె నిందలేనియట్టి తోడునీడవు నీవె ముందువెనకల నిలు ముంగిలియు నీవె యని అందముగ దేశికుఁడె ఆనతిచ్చెనయ్యా చ. యెన్నఁడుఁ గలఁగనట్టి హితుఁడవు నీవె పన్నినట్టెవుండె నిచ్చపంటా నీవె నన్నుఁ గాచే శ్రీవెంకటనాధుఁడ వని తాళ్లపా కన్నమయ్యంగారె నాకు నానతిచ్చిరయ్యా రేకు:0209-03 ముఖారి సంపుటము: 03-051 పల్లవి: నీవెంత నేనెంత నీకు నాకు నెంతదవ్వు దైవమా సిగువడక తగిలేనేఁ గాకా చ. చెంది నీకు బ్రహ్మాదులు సేవలు సేయఁగాను యిందు మా సేవలు నీకు నేడకువచ్చు పొంది వసిష్ణాదు లట్టే పూజలు సేయఁగాను సందడి మాపూజలు సరకా నీకు చ. సనకాదియోగులు సారె నిన్నుఁ దలఁచఁగా యొనసి మాతలఁపు నీ కేడకెక్కును నునుపుగా శేషాదులు నుతులు నిన్నుఁ జేయఁగా పనివడి మా నుతులు బాఁతేయనా నీకు చ. కిట్టి నారదాదులు నీకింకరులై వుండఁగాను ಯುದ್ದಿ నీదాసుఁడ ననుటెంత కెంత వొట్టి శ్రీవేంకటేశ మాకొకవుపాయము గద్దు పట్టి నీదాసుల బంటుబంట నయ్యేనిఁకను రేకు:0299-04 లలిత సంపుటము: 03-575 పల్లవి: నీవెటు దలఁచిన నిఖిలము నటౌ యేవల స్వతంత్ర మింతా నీది