పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/713

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

711 చ. గుట్టునఁ బుట్టుతా బొడ్డు గోయించుకొన్నవాఁడు యిట్టే జారుఁడవంటే యెగ్గా నీకు బట్టబయలు సంసార భ్రమ వట్టి వొట్టి నాటకుఁడ వంటే వొచ్చెమా నీకు చ. అంది యధరపానాన అన్ను వట్టినట్టి వాఁడ చెందిన కపటి వంటే సిగ్గా నీకు ముందే మాయాశక్తి శివమునఁ బొరలేవాఁడ నిందఁ బడ్డవాఁడ వంటే నేరమా నీకు చ. పలుకులప్రల్లదపు బహుభాషివాఁడను యిల వెన్నదొంగ వంటే హీనమా నీకు అలరి శ్రీవేంకటేశ అన్నిటా నీ దాసుఁడను బలుదైత్య హంత వంటే భారమా నీకు రేకు:0173-05 దేసాక్షి సంపుటము:02-360 పల్లవి: నీవు వెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలె నావశమూ తెలియు నారాయణా చ. నీటిలోన నొకబుగ్గ నిమిషములోనఁ బుట్టి కోటిసేసినట్లుండుఁ గొంతవడి పాటించి యందే యడఁగెఁ బ్రకృతియో బ్రహ్మమో యేఁటిదో వీనియర్థ మెరిఁగించవయ్య చ. ఆకసాన నొకగాలి అట్టె మైయుచుఁ బొడమి లోకము సేయ విసరు లోలోనె మైకొని యందే యడఁగె మాయయో సత్యమో యీకడ నీయర్ధము మా కెఱిఁగించవయ్య చ. భూమిలోన మొలకలు పుట్టుచు శ్రీవేంకటేశ వాములై వెలయు నేసేవారికి ఆముక యందే యడఁగె అసతో ఇది సతో యేమో యీయర్థము మా కెరిఁగించవయ్య రేకు:0200-01 మాళవిగౌళ సంపుటము: 02-514 పల్లవి: నీవు సర్వగుణసంపన్నుఁడవు నేనొకదురుణిని మానవు నన్నొక యెదురుచేసుకొని మనసుచూడనేలా అయ్యా చ. యేలినవాఁడవు నీవు ఇటు నేఁ గొలిచినవాఁడ పోలింపఁగ నీవే దేవుఁడవు భువి నే నొకజీవుఁడను పాలించేవాఁడవు నీవు బ్రదికేవాఁడను నేను తాలిమి నన్నొక సరిచేసుక ననుఁ దప్పులెంచనేలా అయ్యా చ. అంతర్యామివి నీవు అంగమాత్రమే నేను చింతింపఁగ నీవే స్వతంత్రుఁడవు జిగి నేఁ బరతంత్రుఁడను ఇంత నీవే దయఁగలవాఁడవు యెప్పుడు నే నిర్ణయుఁడను చెంతల నన్నొక మొనసేసుక నాచేత లెంచనేలా అయ్యా చ. శ్రీవేంకటేశ్వరుఁడవు నీవు సేవకుఁడను ఇటు నేను అవలనీవల దాతవు నీవు యాచకుఁడను నేను నీవే కావఁగఁ గర్తవు నేనే శరణాగతుఁడను కైవశమగు నను ప్రతివెట్టుక నాకథలు యెంచనేలా అయ్యా రేకు: 0132-03 శంకరాభరణం సంపుటము: 02-129 పల్లవి: నీవు సర్వసముడఁవు నీవు దేవదేవుఁడవు ఈవల నాగుణదోషాలెంచ నిఁక నేలా