పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/712

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

710 భావించి నన్నెట్టయినా బ్రదికించుకొనవే చ. సంతతము నన్నెంచితే సర్వాపరాధి నేను యెంత నే వేమిచేసినా నంత కరుఁడ అంతటి లోకజననియైన లక్షిఁ జూచి కాని అంతరాత్మ నిన్నుఁ జూచియైనా మన్ని చవే చ. కలవెన్నెనాఁ దప్పులు కనఁగొన నావల్ల చెలఁగ్ యందుకుఁ బ్రాయశ్చిత్తము లేదు లలి నాభుజము చక్రలాంఛనము చూచి కాని అల నానోరిమంత్రమైనాఁ జూచి యేలుమీ చ. మతి నిన్నెటిఁగేనంటే మదోన్మత్తుఁడ నేను గతి యేది నాకు శ్రీవేంకటగిరినాయక సతతము నీబిరుదు సారెకుఁ జూచి కాని ప్రతిలేని నీదయయైనా భావించి చేకొనవే రేకు: 0373-02 లలిత సంపుటము:04-429 పల్లవి: నీవు నాసామ్మవు నేను నీసొమ్ము యీవల నీవెపుడు మాయింటనుండఁ దగవా చ. హరి నీరూపము నాకు నాచార్యుఁడు మున్నె కెరలి నాపాల నప్పగించినాఁడు నరహరి నిను నే నన్యాయమునఁ దెలియను పారఁబడి నీ కెందుఁ బోఁదగునా చ. జనని నీదేవి లక్షిజనకుఁడవు నీవె తనువులు నాత్మబాంధవము నీవె అనయము నేనెంత యపరాధినైనాను పనివడి నీవు నన్నుఁ బాయఁదగునా చ. బహువేదములు నిన్ను భక్తవత్సలుఁడవని సహజజరుదు భువిఁ జాటీని యిహమునఁ శ్రీ వేంకటేశ యిది దలఁచైన విహితమై నాకడకు విచ్చేయవే పె.అ.రేకు:0058-02 నాట సంపుటము: 15-329 పల్లవి: నీవు లక్ష్మీపతివి నిన్ను నమ్మినవారికి యేవల నిహపరము లిచ్చుటేమరుదు చ. శునక మొకటి ధర్మజునివెంటఁ దిరిగితేఁ దన పుణ్యగతి యిచ్చె దాని కందురు మనికి నేకలవ్యుఁడు మంటిబొమ్మఁ గొలిచితే నెనలేని విలువిద్య విన్ని నిచ్చెనందురు చ. శరనిధికి విప్టుఁ డక్షతలు నిత్య మిడితే సరిలేని మాణిక మొసగె నందురు ధరఁ బామున కొకఁడు తాఁ బంచాంగము చెప్పితే దరిద్ర మణఁగను రత్నము నిచ్చెనందురు చ. చెచ్చెరను వొక గువ్వ శిబిమఱఁగు చొచ్చితే కచ్చుపెట్టి యంతలోనే కాచి నందురు యిచ్చల శ్రీవేంకటేశ యిట్టే విభీషణుఁడు మచ్చిక నీ శరణంటే మన్నించితి వందురు పె.అ.రేకు:0063-04 దేసాళం సంపుటము: 15-361 పల్లవి: నీవు లోకోన్నతుఁడవు ని న్నెఱుఁగరా యిందరు వేవేలు నేఁ గెలసిన వెలితా నీకు