పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/711

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

709 వేవేలు రూపులై వెదచల్లితపుడు చ. పదిలముగ నిరువంకఁ బసిడి పింజల యంప పాదల తరకసములొరపులు నెరపఁగా గదయ శంఖంబు చక్రము ధనుః ఖడ్గములు పదివేలు సూర్యబింబములైనవపుడు చ. సారిది శేషుని పెద్దచుట్టు పెనుఁగేవడము సిరి దొలఁక నొకచేతఁ జిత్తగించి దురమునకుఁ దొడవైన ధూమకేతువు చేత ఇరవైనబల్లెమై యేచెనందవుడు చ. కరకజడతో రమాకాంత జయలక్షియై తొరలి కౌగిట నిన్నుఁ దొడికి పట్టి చరచె వెను వేంకటస్వామి నిను గెలువుమని మెరుఁగుఁగుచకుంభముల మిసిమితో నపుడు రేకు:0221-03 సామంతం సంపుటము: 03-116 పల్లవి: నీవు దేవుఁడవు నేనొక జీవుఁడ యీ విధి నిద్దరి కెంతంతరువు చ. పొడమిన జగములు పుట్టెడి జగములు గుడిగొనె మీ రోమకూపముల యెడయక నీరూప మేమని ధ్యానింతు అడరి మీవాఁడ నేననుటే కాక చ. మునుపటి బ్రహ్మలు ముందరి బ్రహ్మలు మొనసి మీ నాభిని మొలచేరు ఘనుఁడవు నిన్నేగతి నేఁ దెలిసెద అనువుగ మిము శరణనుటే కాక చ. సహజానందము సంసారానOదమిహముఁ బరముగా నిచ్చేవు అహిపతి శ్రీవేంకటాధిప నీకృప మహిలో సేవించి మనుటే కాక రేకు:0277-04 శ్రీరాగం సంపుటము: 03-445 పల్లవి: నీవు నట్ల నేరుపు నేరమి నేఁడు నా యెడకుఁ జూడకుమీ సేవలయెడ తృణము మేరువుగఁ జేసుకోఁగలవు నీమహిమలను చ. తప్ప లెరంగము వొప్ప లెరంగము దైవము నే నిను నుతియించేదా నెప్పున వేదము సకలశబ్దము నీవేయని చాటఁగ వినుచు ఇప్పుడు బ్రిష్టాంత మొకటి చెప్పెద నిందుకు సముద్రుఁ డిటు తనలో చిప్పలు గుల్లలు బహురత్నంబులు చేకొని గర్బీకరించుఁ గదా చ. కర్మ మెరంగ నకర్మ మెరంగను కరుణానిధి నినుఁ బూజించేదా నిర్మల వేదము చైతన్యంబిది నీవేయని చాటఁగ వినుచు అర్మిలి ద్రిష్టాంత మిందుకు నొకటె అన్నియు గర్బీకరించుకొని ధర్మాధర్మపు మనుజులనెల్లాఁ దగ నీ భూకాంత మోచుఁ గదా చ. జ్ఞాన మెరఁగ నజ్ఞాన మెరఁగను సారెకు నిను నేఁ దలఁచేదా ఆనిన వేదము శ్రీవేంకటేశ్వర అంతరాత్మ నినుఁ జాటఁగను పూని ద్రిష్టాంతము మీ కిటు సరిగాఁ బోలుపరా దిఁకనైనాను తానే సూర్యుఁడు రాత్రి గల బయట తన గుణము వేగి నెరపుఁ గదా రేకు:0143-04 కన్నడగౌళ సంపుటము: 02-192 పల్లవి: నీవు నన్ను రక్షించితే నింద నీపై బడదు