పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/710

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

708 భావించ నేరక వట్టిభ్రమఁ బడవలెనా చ. కరుణానిధి నీవు గలిగివుండఁగాను తిరుమంత్రమే నాకు దిక్కయివుండఁగా వరుస నాచార్యుఁడు వహించుక వుండఁగాను పరగఁ దపము చేసి బడలఁగవలెనా చ. కమలాక్ష నీముద్రలే కాచుక నాకుండఁగాను అమరి దాస్యము కాణాచై వుండఁగా తమితోడ వైష్ణవులు దాపుదండై వుండఁగాను తెమలి తీర్ణాలెల్లా బ్రిష్టించవలెనా చ. శ్రీవేంకటేశ్వర నీసేవే గతియై యుండఁగా ఆవటించి నుతి వుపాయమై వుండఁగా తావులనే శరణనే ధర్మము రక్షించఁగాను వేవేలు దానాలు చేసి వేఁడుకొనవలెనా పె.అ.రేకు:0061-01 మాళవిగౌళ సంపుటము: 15-346 పల్లవి: నీవు చేసినపనులు నీకే చెల్లెఁ గాక యీవల నింతేసి చేయ నెవ్వరికీఁ జెల్లదు చ. దొడ్డ లేల బ్రహ్మండము తూఁటవోఁ బొడిచితివి సడ్డసేయ కొత్తితివి సముద్రమును అడ్డము లేదంటాను హరివిల్లు విఱిచితివి వొడ్డారాలే నీ కతలు వొద్దనే వా రెవ్వరు చ. నీరు చట్టు చేసితివి నీవే నీ యాజ్ఞ మీటి ధారుణి చక్రవాళము దాఁటితివి ఆరయ లోకములు మూఁ డడుగులు సేసితివి దూరులే యివెల్లా నీసుద్దులు చెప్పేనేఁటికి చ. నిక్కిన కులగిరులు నేలమట్టు చేసితివి పక్కనఁ దెచ్చితి వింద్రుపారిజాతము గుక్కక శ్రీవేంకటేశ గొల్లెతలఁ గైకొంటివి వెక్కసపు నీ వోజలు విచారించవైతివి రేకు:0139-04 భైరవి సంపుటము: 02-169 పల్లవి: నీవు జగన్నాథుఁడవు నే నొకజీవుఁడ నింతే నీవలె ననుభవించ నేనెంతవాఁడను చ. వైకుంఠపదమేడ వడిఁ గోర నెంతవాఁడ యిూకడ నీదాసుఁడనౌ టిది చాలదా చేకొని నీసాకారచింత యేడ నేనేడ పైకొని నీడాగు మోచి బ్రదికితిఁ జాలదా చ. సాంపుల నీయానందసుఖ మేడ నేనేడ పంపు శ్రీవైష్ణవసలాపన చాలదా నింపుల విజ్ఞాన మేడ నే దెలియ నెంతవాఁడ యింపుగా నీకథ వినుటిదియే చాలదా చ. కైవల్యమందు నీతో కాణాచి యూడ నాకు శ్రీవేంకటాద్రిమీఁది సేవ చాలదా యీవల శ్రీవేంకటేశ నీ విచ్చిన విజ్ఞానమున భావించి నిన్నుఁబొగడే భాగ్యమే చాలదా రేకు: 9058-01 సాళంగం సంపుటము: 04-569 పల్లవి: నీవు తురగముమీఁద నేర్పు మెరయ