పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/707

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

705 కామించి హరి నీ వొక్కఁడవే నిజము చ. చచ్చేటి దొకమాయ హరిఁ బుట్టేదొకమాయ మచ్చుమేపులసిరులు మాయలో మాయ వచ్చేటి దొకమాయ వచ్చిపోయ్యే దొకమాయ కచ్చుపెట్టి హరి నీ వొక్కఁడవే నిజము చ. పొద్దువొడచేది మాయ పొదుగుంకే దొకమాయ నిదురయు మేల్కనేది నిండుమాయ వొద్దనే సుఖము మాయ వొగి దుఃఖ మొకమాయ గద్దరి శ్రీహరి నీ వొక్కఁడవే నిజము చ. కూడేటి దొకమాయ కూడి పాసే దొకమాయ యేడ నేర్చితి శ్రీవేంకటేశుఁడ నీవు వేడుక నీశరణంటి విడిపించు మీమాయ వోడక వెదకితి నీ వొక్కఁడవే నిజము రేకు:0196-01 దేవగాంధారి సంపుటము: 02-492 పల్లవి: నీయంత నీవే యెరిఁగి నిచ్చ నన్నుఁ గాతు గాక మాయలలోఁ బొరలే దిమ్మరివాఁడ నేను చ. నీ సరివాఁడనా నిన్ను దూరేవాఁడనా దాఁసుడనై కొలిచిన తనుధారిని వేసరించ నోపుదునా వెరపించఁగలనా మాసిన పాపాలలోని మైల సాశీఁకినాఁడను చ. విన్నవించేవాఁడనా వీడు జోడువాఁడనా అన్నిటా శరణుచొచ్చినట్టి జీవిని యెన్నిటి కుత్తరమిచ్చే యేపని సేసి మెప్పించే మున్నిటి కర్మములకు ముంగిట నున్నాఁడను చ. యెదురాడేవాఁడనా యెలయించేవాఁడనా సదరాన నీకు మొక్కేజంతువ నేను ఇదివో శ్రీవేంకటేశ యెరుక నీ వొసగఁగా పొదిగి నీమహిమలు పొగడుచున్నాఁడను రేకు:0108-05 సాళంగనాట సంపుటము: 02-047 పల్లవి: నీయంతటివా రెవ్వరు నీకు నెదురేది యెందు చాయల నీసుద్ది విని శరణంటి నేను చ. కావలనంటేఁ దొల్లి కంభము చించుకవెళ్లి కైవశమై ప్రపదుఁ గావవా నీవు తేవలనంటే బ్రహ్మదేవునికి వేదములు సోవల సముద్రమయిన చొచ్చి తేవా నీవు చ. పట్టియెత్తవలెనంటేఁ బాతాళానఁ బడ్డ కొండ తట్టియెత్తి పాలవెల్లి దచ్చవా నీవు మట్టుపెట్టవలెనంటే మరి భూమి చాపగాఁగ చుట్టుకపోతేఁ దెచ్చి సొంపుగ నిలుపవా చ. పక్షపాతమయ్యేనంటేఁ బాండవుల గెలుపించి యీక్షితి యేలించి చనవియ్యవా నీవు రక్షించేనంటేఁ గాతరాన శ్రీవేంకటాద్రిఁ బ్రత్యక్షమై మావంటివారిఁ దగఁ గరుణించవా పె.అ.రేకు:0054-05 సామంతం సంపుటము: 15-309 పల్లవి: నీయంతవాఁడనా నేను నేరము లే మెంచేవు