పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/708

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

706 యీయెడ నిరుహేతుకకృపఁ జూడు నన్నును చ. నిరతి నిన్నెఱుఁగను నీవు నన్నెఱుఁగుదువు ధర యాచకుఁడ నేను దాతవు నీవు వరుస నీచుఁడ నేను వైకుంఠపతివి నీన నరుఁడ నేను నీవు నారాయణుఁడవు చ. సారె నలసుఁడ నేను సర్వశక్తివి నీవు ధీరుఁడవు నీవతి దీనుఁడ నేను కారుణ్యమూర్తివి నీవు కలినచిత్తుఁడ నేను మేరతో నీ వేలికవు మీ దాసుఁడ నేను చ. జననశీలుఁడ నేను జనకుఁడవు నీవు ఘనవేదాంతనిధివి కర్మిని నేను అనిశము శ్రీవేంకటాచలేంద్రుఁడవు నీవు పనుల నీ సంకీర్తనపరుఁడ నేను రేకు:0209-05 గుండక్రియ సంపుటము: 03-053 పల్లవి: నీయంతవారు గారు నిండుసామర్థ్యము లేదు యీ యహంకారపు ముక్తి యీడేరీనా తమకు చ. నీ సేవలే సేసి నీ కృప రక్షించంగాను ఆసలఁ బొందే ముక్తి అది చాలక నీ సరివారలై నీవే తామనుకొని యీసులఁ బొందే ముక్తి యీడేరీనా తమకు చ. పొంచిన రాక్షసులెల్ల పూర్వదేవతలమంటా యెంచుక పట్టిన మదమీ గర్వము అంచెలఁ గర్మమే సేసే రాయాదేవతలఁ గూర్చి ఇంచుకంతలోనే ముక్తి యీడేరీనా తమకు చ. హరిలాంఛనపు భక్తి కందుకు నొడఁబడరు సరిరోగికిఁ బథ్యము చవిగానట్టు గరిమ శ్రీవేంకటేశుఁ గని మననివారికి యొరవులనే ముక్తి యీడేరీనా తమకు రేకు:0079-01 రామక్రియ సంపుటము: 01-376 పల్లవి: నీయాజ్ఞ దలమోచి నీ దేహధారి నైతి యీ యేడ గోవిందుఁడ నే నీడేరేదెట్లో చ. తనువు వేసరినాను తలఁపు వేసరదు ధనముగడించెడితరితీపున చెనకి ముగఁడు విడిచిన మామ విడువనిపనియాయ హరి నాబదుకుజాడ యెట్లో చ. పాయము ముదిసిన నాను భావము ముదియదు వేయైనా సంసారవిషయాలను వోయయ్య కలివోసినావుట్లదిక్కు చూచేది మాయదాయ నిఁక నామనసుజాడెట్లో చ. కడలేనినావిధులు కన్నులారఁ జూచి నీవు నడుమ శ్రీవేంకటేశ నన్ను నేలితి నొడుగులు దప్పినాను నోముఫలము దప్పనిఅడియాల మబ్బె నాకు నానతిచ్చి తెట్లో రేకు: 0341-03 కౌశి సంపుటము: 04-240 పల్లవి: నీవంటిదైవాలు వేరీ నిఖిలలోకములందు