పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/706

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

704 వావిరి సుఖించ నేర్చేవారివారి పుణ్యమూ చ. కొలిచే మనేవారికి కోరినయ్లికవు తలిఁచే మనేవారికి దైవమవూ సాలనే మనేవారికి చుట్టమవు నీవు వలసి నందు భావించేవారివారి పుణ్యము చ. తగిలే మనేవారికి ధనధాన్యమవు నీవు పగటు కృషికులకు పాఁడిపంటవూ తగిలిన యోగీంద్రులకు తత్త్యరహస్యము నీవు వగలఁ దెలుసుకొనేవారివారి పుణ్యము చ. చదివే మనేవారికి సర్వశాస్త్రములు నీవు మొుదల నందరికిని మూలమవు కదిసి శ్రీవేంకటేశ గతి నా కైతే నీవు వదలక చేపట్టేవారివారి పుణ్యము రేకు:0044-03 కన్నడగౌళ సంపుటము: 01-270 పల్లవి: నీమహత్త్యంబు లోనికిఁ వెలుపలికిఁ గప్పి కామింప నిట్టిదని కానరా దటుగాన చ. నిండి యిన్నిటిలోన నీవు గలవని భ్రాంతినుండుదువుగాని నీ వొకటియునుఁ గావు దండిగలగిరి ప్రతిద్వని దోచుఁగాని యది కొండలోపల లేదు కొండయునుఁగాదు చ. బలసి యిన్నిటిలోపలనుఁ జైతన్యమై మెలఁగుదువుగాని యేమిట నీవు లేవు పలుదెరఁగులైన దర్పణమునందొక నీడ వొలయుఁగా కందు దలపాణియు నది లేదు చ. వుడుగ కన్నిటిలోన నుండుటయు లేదు నీవుడివోయి యందుండ కుండుటయు లేదు చెడని తేజముగాన శ్రీవేంకటేశ నీపొడవు పరిపర్ణమై పొలుపొందుఁగాన రేకు: 0213-04 లలిత సంపుటము: 03-076 పల్లవి: నీమహి మది యెంత నీవు చేసే చేఁతలెంత దీమసపు నీ మాయలు తెలియరాదయ్యా చ. నీ పాదతీర్ధము నెత్తి మోచె నొకఁడు పూఁపకొడుకై యొకఁడు బొడ్డునఁ బుట్టె యేపున నింతటివారి కెక్కుడైన దైవమవు మోపుచు ధర్మరాజుకు మొక్కుటెట్టయ్యా చ. నీ లీల జగమెల్లా నిండి యున్నదొకవంకఁ నోలి నీలో లోకాలున్నవొక్రవంక యే లీలఁ జూచినాను యింతటి దైవమవు బాలుఁడవై రేపల్లెలోఁ బారాడితివెట్టయ్యా చ. శ్రీసతికి మగఁడవు భూసతికి మగఁడవు యీ సరుస శ్రీవేంకటేశుఁడవు రాసి కెక్కి నీవింతటి రాజసపు దైవమవు దాసులము మా కెట్ల దక్కితివయ్యా రేకు: 0190-03 బౌళి సంపుటము: 02-458 పల్లవి: నీమాయ కల్లగాదు నిజము దెలియరాదు