పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/705

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

703 ఆదినారాయణ నాకు నదియె పాశీ వ్రతము చ. హరి నిన్నుఁ బాసినట్టి యమరేంద్రలోక మొల్ల గరిమ నీవు గూడని కర్మము నొల్ల పరగ నీ నుతిలేని పలుచదువులు నొల్ల హరి నీ కథ వినని సభ చొర నొల్ల చ. దేవ నీ దాస్యములేని దేవసంభాషణ యొుల్ల భావించి నీకు మొక్కని ఫలము నొల్ల ఆవల నీ వారగించని యమృతపానము నొల్ల శ్రీవిభుఁడ నీవులేని చింత నే నొల్ల చ. అంది నీ సేవ సేయని యగ్రజన్మమైన నొల్ల పొంది నీ కొప్పనగాని భోగము నొల్ల యిందునే శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె అందితి జీవన్ముక్తి యావ లేమి నొల్లా రేకు:0104-02 భైరవి సంపుటము:02-020 పల్లవి: నీదాస్యమొక్కటే నిలిచి నమ్మఁగలది శ్రీదేవుఁడవు నీచిత్తము నాభాగ్యము చ. అనుష్టానములు గతియని నమ్మి చేసితినా తనువిధి మలమూత్రములప్రారీగు జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా వొనరఁ గర్మమనే వోఁదానఁ బడినది చ. చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా పారెదలిన మతముల పాశీరాట మది మదిమది నుండిన నామనసే నమ్మితినా అదియును నింద్రియాల కమ్ముడువోయినది చ. పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా పాత్రమగు రుణానుబంధము లవి చిత్రముగ నన్నుఁ గావు శ్రీవేంకటేశ నీవే పత్రపుష్పమాత్రమే నాభక్తియెల్లా నీకు రేకు: 0372-04 భూపాళం సంపుటము: 04-425 పల్లవి: నీనామమే మాకు నిధియు నిధానము నీనామమె యాత్మనిధానాంజనము చ. నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వామనా చ. నమో నమో శ్రీధర నమో హృషీకేశ నమో పద్మనాభ నమో దామోదర నమో సంకర్షణ నమో వాసుదేవ నమో ప్రద్యుమ్నతే నమో యనిరుద్ధా చ. నమో పురుషోత్తమ నమో యధోక్షజ నమో నారసింహ నమో యచ్యుత నమో జనార్ధన నమో ఉపేంద్ర నమో శ్రీవేంకటేశ నమో శ్రీకృష్ణా పె.అ.రేకు:0017-05 సాళంగనాట సంపుటము: 15-097 పల్లవి: నీపల్లఁ గడమ లేదు నిజమూర్తివి