పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/704

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

702 ఆది నీ దాసుఁడె చాలు నందరి రక్షించ చ. నీ పాదమూలముల నిలిచిన జలములు మోపుగా మోఁచె రుద్రుఁడు ముందు ముందె కాపాడు నీ నామమునఁ గలిగిన మహిమచే పై పై మునులు యిహపరములు గనిరి చ. పండేటి పాలవెల్లి నీ ప్రసాదమునఁ గాదె దండిగా దేవతలెల్లా ధన్యులైరి అండనె నీ సాకార మాత్రుమఁ దలఁచి గాదె నిండిన యోగీంద్రులు నిత్యముక్తులైరి చ. చేరి నీ విహారమైన శ్రీ వేంకటాద్రి గాదె కోరివరము లందరు కొల్లగొనిరి ఆరీతిఁ దాళ్లపాక అన్నమయ్య ఘనుఁడాయ వారివారమైన నేము వహికి నెక్కితిమి రేకు:0282-04 లలిత సంపుటము: 03-473 పల్లవి: నీదాకా వలెనా నిచ్చలు నారాయణా ఆది నీ దాసుఁడే చాలు నందరి రక్షించను చ. నీ పాదమూలమున నిలిచిన జలమును మోపుగా మోచె రుద్రుఁడు ముందు ముందే కాపాడు నీ నామమునఁ గలిగిన మహిమచే పైపై మునులు యిహపరములు గనిరి చ. పండేటి పాలవెల్లి నీ ప్రసాదమునఁ గాదె దండిగా దేవతలెల్ల ధన్యులైరి అండనే నీసాకార మాతుమఁ దలఁచి కాదె నిండిన యోగీంద్రులు నిత్యముక్తులైరి చ. చేరి నీవిహారమైన శ్రీవేంకటాద్రిఁ గాదె కోరి నరులు వరాలు కొల్లగొనిరి ఆరీతిఁ దాళ్లపాక అన్నమయ్య ఘనుఁడాయ వారివారమై నేము వహికినెక్కితిమి రేకు:0247-01 దేసాక్షి సంపుటము: 03-266 పల్లవి: నీదాసుల భంగములు నీవు చూతురా యేదని చూచేవు నీకు నెచ్చరించవలెనా చ. పాలసముద్రముమీఁదఁ బవ్వళించినట్టి నీకు బేలలై సురలు మొరవెట్టినయట్టు వేళతో మా మనవులు విన్నవించితిమి నీకు యేల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాదా చ. ద్వారకానగరములో తగ నెత్తమాడే నీకు బీరాన ద్రౌపది మొరవెట్టినయట్టు ఘటోరపు రాజసభలఁగుంది విన్నవించితిమి యే రీతి పరాకు నీకు నిఁక రక్షించరాదా చ. యెనసి వైకుంఠములో నిందిరం గూడున్న నీకు పెనఁగి గజము మొరవెట్టినయట్టు చనవుతో మా కోరికె సారె విన్నవించితిమి విని శ్రీవేంకటేశుఁడ వేగ రక్షించరాదా పె.అ.రేకు:0040-04 గౌళ సంపుటము: 15-229 పల్లవి: నీదాసులపంచ నీడ నుండితేఁ జాలు