పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/703

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

701 తోచి కాచి యిటు తుద కీడెర్చె చ. దేవతలపాలు తీరని పుణ్యము ఆవలC బాపO బసురలది భావింప మనుజులపాలివి రెండును శ్రీవల్లభ నీనేసిన మాయ చ. వేదశాస్త్రములు విజ్ఞానమూలము ఆది నసత్యము లజ్ఞానమూలము సాదింప రెండును జగత్తుమూలము భేదించి యివి నీపెరరేఁపణలు చ. కావింపఁ గర్మము కాయము చేతిది భావము చేతిది పరమము తావుల రెండునుఁ దప్పని ప్రకృతివి శ్రీవేంకటేశ్వర చేఁతలు నీవి రేకు:0156-01 శంకరాభరణం సంపుటము: 02-263 పల్లవి: నీచిత్తము నాభాగ్యము నేనెంతటివాఁడను యేచి నీవు రక్షించేదే యొక్కుడుపుణ్య మింతే చ. పాటించి నీభావము పట్టవశమా తలఁచి మేటి నామనసు నీకు మీఁదెత్తు టింతే నూటికైన నీనామము నుడుగఁగ వశమా మాటలు నీ సెలవుగా నుట్టుపెట్టుటింలే చ. వేవేలైన నీకథలు వినఁగ నాతరమా సావగా వీనులు తావు చూపుట యింతే దేవ నీసాకారము ద్రిష్టించ నావశమా పావనముగా నందులోఁ బనిగొను టింతే చ. గట్టిగా నిన్నుఁ బూజించఁ గమ్మటి నావశమా నెట్టిన నామేను నీకు నేమించు టింతే పట్టపలమేల్మంగపతివి శ్రీవేంకటేశ జట్టిగొనుకొరకు నీశరణను టింతే రేకు: 0338-05 సాళంగనాట సంపుటము: 04-224 పల్లవి: నీటముంచు పాలముంచు నీచిత్త మిఁకను చాటితి నీకృప గురి సంసారమునకు చ. హరి నీవే గురి నాయూతుమలోపలికి అరిది శంఖచక్రాలే యంగపుగురి పరమపదమే గురి పట్టినవ్రతమునకు తిరుమంత్రమే గురి దిష్టపునాలికకు చ. గోవింద నీపాదపూజే గురి నాదాస్యమునకు తావుల నాభక్తికి నీదాసులే గురి ఆవల నాకర్మమున కాచార్యుఁడే గురి దేవ నీశరణు గురి దిష్టపు జన్మానకు చ. నగు శ్రీపతి గురి నన్ను రక్షించుటకును తగుసంకీర్తన గురి తపమునకు తెగనిజ్ఞానమునకు తిరుమణులే గురి మిగుల శ్రీవేంకటేశ మించి నీవే గురి పె.అ.రేకు:0028-06 భూపాళం సంపుటము: 15-164 పల్లవి: నీదాఁక వలెనా నిఖిలము వారికెల్ల