పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/702

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

700 యీకడ లాలించితే మే మిటు నిన్ను గొలుతుము చ. మాటలకు లోఁగాని బ్రహ్మమనంటా దాఁచి దాఁచి మాటాడకుండేవు సుమ్మీ మాతో నీవు నీటున మనసులో నిలుపరానివాఁడనంటా పాటించి మాకుఁ బొడచూపకుంటే గతి యేది చ. శ్రుతులకుఁ బట్టరాని చోద్యపు బ్రహ్మమనంటా మతకానఁ జిక్కక మానేవు సుమ్మీ పతివి నీ గంభీరము బయటఁబడీ నంటా అతిగోప్యాన నిన్నది యెట్టెఱిఁగేము చ. మాయవన్నుకొనిన వుమ్మడి బ్రహ్మమనంటా యేయడనైననా భ్రమయించేవు మ్మీ పాయపు టలమేల్మంగపతివి శ్రీవేంకటేశ యీయెడ నీశరణంటి మిన్నిటా మమ్మేలుమీ రేకు: 0382-01 సాళంగనాట సంపుటము: 04-476 పల్లవి: నీగురుతులు చూచుకోనీబిరుదు లెంచుకో యీగతిని కలబంట నిఁకనన్నుఁ గావవే చ. కానిలే నేనెంత కఠినచిత్తుఁడనైన నానొసల నివే పట్టెనామములు మేను తోలునెమ్ములతో మెరసినదైనాను పూనితిఁ దమ్మితులసి పూసల పేరులు చ. భ్రమసి నేఁజేసినవి పాపకర్మములైనాను జమళి భుజాల నివే శంఖచక్రాలు అమరఁ దఱచుగా నే నాడేవి కల్లలైనా తమిఁ బాడీ నాలిక నీతగు సంకీర్తనలు చ. తలఁచితే నావోజ తామస గుణమైనాను పిలిచేది భువిలో నాపేరు తిమ్మఁడు అలర శ్రీవేంకటేశ అన్నిటనే దుష్టనైనా త్రలకొరెనె నా యందు దాసరి తనములు రేకు: 0371-02 గుండక్రియ సంపుటము: 04-417 పల్లవి: నీచమైననావల్ల నెరవై దైవమా చీ చీ యిన్నివిధులఁ జిక్కువడె బదుకు చ. యెదుటివేమైనఁ గోరు నింతలోనే మనసు అది సంభవించకున్న నలమటపడుఁ దాను కదిసి చేకూరితేను ఘనమై హర్షించు వెద నీరువంక తుంగ విధమాయ మనసు చ. యొక్కడికైన నేఁగు నెరఁగక తనువు అక్కడ దుర్లభమైతే నంతలో వేసారు దక్కి యందే సుఖమైతేఁ దానే విఱ్ఱవీఁగు గక్కున రొంపలోని కంభమాయఁ దనువు చ. యెందుకైన సమ్మతించు నిరవైన జీవుఁడు చెందిన పసిఁడికి చెలులకే మత్తుఁడౌను కందువ శ్రీ వేంకటేశ కరుణించవయ్య యింక పారింది పూట చెలమూయఁ ಬುಟ್ಟುಗುಲ సివము రేకు:0195-04 మాళవిగౌళ సంపుటము: 02-489 పల్లవి: నీచిత్త మిందరినేరుపు నేరమి