పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/701

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

699 పైకొని శ్రీహరి నీవే పరిహరించవే చ. విజ్ఞానములు గొన్ని విందు నే నూరకే సుజ్ఞానములు గొన్ని చూతు నే నేపొద్దు అజ్ఞానము నే ననిశము నడచేది ప్రజ్ఞాహీనుఁడ నెంత పాపకర్మమో చ. సుకృతము లొకమరి సారిది నే బోధింతు ప్రకృతి యొక్కొక వేళ భావింతు నాత్మలో అకృతములే నే ననిశముఁ జేసేది వికృతాచారుఁడ నింకా వికార మెంతో చ. ధర్మమార్గమూఁ గొంత తలఁపున నెరిఁగితి నిర్మలచిత్తమై మోక్షనిలయము నెరిఁగితి నిర్మించి శ్రీవేంకటేశ నీవు నన్ను నేలఁగాను మర్మమెరిఁగితి నెట్ల మన్ననఁ గాచితివో పె.అ.రేకు:0063-06 బైరవి సంపుటము: 15-363 పల్లవి: నీకే సెలవని నెపమువేయుట యింతే కైకొని కాచే నీవుపకారమే దక్కినది చ. వొట్టి నీ కొఱకుఁగా వుపవాసా లుండేనంటే అట్టె నీకు లాభము అందేమున్నది జట్టిగా నిన్నుఁ గూరిచి సన్యాసి నయ్యే నంటే చుట్టుకొని నీకు గల్లే సుఖమం దేమున్నది చ. కడు నీ పాదతీర్థపు గంగలో నానే నంటే అడరిన తనివి నీ కందేమున్నది అడవిలో ఘనోరతప మంది నీకుఁ జేసే నంటే అడియాలమైన ఫల మందు నీ కేమున్నది చ. నిన్నుఁ గనుఁగొన్నదాఁకానే గడ్డము వెంచే నంటే అన్నిటా నీకుఁ గూడేది అందేమున్నది వున్నతి శ్రీవేంకటేశ వూరకే నీ వాఁడ నైతి యొన్న నీకుఁ గాక యిఁక నం దేమున్నది పె.అ.రేకు : 0033-01 దేవగాంధారి సంపుటము: 15-183 పల్లవి: నీకేమిటికే గడమ నీకొఱకు నింత యేల కైకొన్న నీ దాసులకే గడించేవు దేవుఁడ చ. బ్రతుకేటి బ్రతుకెల్ల పై పై నాలుబిడ్డలకే గతిగా సంసారులు గడియింతురు యితవై జగత్తు లెల్ల యేలెడివిధ మెల్ల తతి నీదాసులకేతలఁ పెల్ల దేవుఁడ చ. యెదుటనే తమరాజ్య మొక్కుడుగా నేలుటెల్ల పదపడి తొత్తులకు బంట్లకేకా పొదిగి లక్ష్మీపతివై భూపతివై యుండుటెల్ల కొదలేని నీ దాసులకొఱకే దేవుఁడా చ. బలిమిఁగైదువ వట్టి పదిలమై కాచే దెల్ల యిలఁ దనవారు సుఖియుంచుటకే కా లలి చక్రమువట్టిన లావు లెల్లా నీ దాసులు వెలసేటి కొఱకు శ్రీ వేంకటాద్రిదేవుఁడ రేకు: 0156-03 ముఖారి సంపుటము:02-265 పల్లవి: నీకేల యీగుణము నీ వేమి గట్టుకొంటివి