పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/700

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

698 జోక నురుత మెచ్చిన సులభండవేకా చ. నేరములు దొలఁగించ నెలవులు గలిగించ గారవించ హరి నీవే కలవు నాకు నార పేరఁ బిలిచితే నారాయణ యనెనంటా చేరి కాచినటువంటి శ్రీపతివిగా చ. దురితము లణఁగించ దుఃఖములు పెడఁబాప గరిమఁ గేశవ నీవే కలవు నాకు మరమరా యంటేను మరి రామ యనెనంటా తిరముగఁ గాచి నట్టి దేవుఁడవుగా చ. వినుతులు చేకొని వేడుకతో నన్నుఁ గావ ఘనుఁడ శ్రీవేంకటేశ కలవు నాకు మనసునఁ దలఁచితే మాటలఁ బిలిచెనంటా తనిసి కంభాన వెళ్లే దైవమవుగా రేకు:0265–02 మలహరి సంపుటము: 03-373 పల్లవి: నీకెటు వలసె నటుసేయి నీచిత్తము నా భాగ్యము యేకడనైనా లక్షీకాంతుఁడ ఇదియే పో నా విన్నపము చ. నాగుణములే యెంచితినా నరక కూపములు చాలవు ఆగతినే నాకర్మములూ అనుభవించి తీర్చెనంటే నీ గుణములే యెంచితివా నిఖిలసంపదలు చాలవు యీగి ననుఁ గరుణించి యెపుడు నీవిచ్చేనంటేను చ. నా పాపములే లెక్కించితినా నదుల యిసుకలునుఁ జాలవు యేపున నెంతైనాఁ గలదు అది యెన్నఁడు దీరును దేవా చేపట్టి నీవు రక్షించిన యాజీవుల నెంచితివా తొల్లి చూపట్టెడి యీ యాకసంబు పై చుక్కలకంటే ఘనము చ. మణి నాసుద్దులు యెంచఁగ నెంచఁగ మంచముకిందే నూయి గుఱి నీకథలివి వినఁబోతే నివే కొండలుఁ గోటానఁగోట్లు నెఱవుగ శ్రీవేంకటేశ్వర నీకే నే శరణాగతి చొచ్చితిని తఱి దరిచేర్పఁగఁ గూడువెట్టఁగా దైవము నీకే భారము రేకు: 0333-05 శంకరాభరణం సంపుటము: 04-194 పల్లవి: నీకే నే శరణు నీవు నన్నుఁ గరుణించు యీకడ నాకడ దిక్కు యెవ్వరున్నా రిఁకను చ. కన్నులఁ జంద్రసూర్యులుగలవేలుపవు నీవు పన్నినలక్షిభూమిపతివి నీవు అన్నిటా బ్రహ్మకుఁ దండ్రియైన యూదివేలుపవు యెన్నఁగ నీకంటే ఘన మెవ్వరున్నా రిఁకను చ. దేవతలందరు నీ తిరుమేనైనమూర్తి ఆవలఁ బాదాన లోక మణ(చితివి నీవొక్కఁడవే నిలిచిన దేవుఁడవు యేవేళ నీకంటే నెక్కుడెవ్వరున్నా రిఁకను చ. అరసి జీవులకెల్ల నంతరాత్మవైన హరి సిరుల వరములిచ్చే శ్రీవేంకటేశ పురుషోత్తముఁడవు భువనరక్షకుఁడవు యిరవైననీవేకాక యెవ్వరున్నారిఁకను రేకు:0271-05 ఆహిరి సంపుటము: 03-410 పల్లవి: నీకే శరణంటి నిన్నే నమ్మితినయ్య