పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/699

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

697 నాకు వసగానివెల్ల నన్నుఁ బాసీనయ్యా చ. పాపమూల మటు తొల్లి పైకొన్న దేహము పాపము సేయకుండితే పక్కున నేల మాను కోపమే కూడుగఁ గుడిచిన యీబుద్ధి కోపము విడువుమంటే గుణమేల మాను చ. అప్పు దీర్చ వచ్చినట్టి ఆయపు సంసారము అప్పు దీర్చుకోకుమంటే నది యేమిటికి మాను తప్ప వేయవచ్చి నన్నుఁ దగిలె నీ కర్మములు తప్పులు వేయక సారెఁ దా మేల మాను చ. పంచమహాపాతకాలే పట్టుకొనే యింద్రియాలు పంచమహాపాతాకాలే బారిఁ దోయ కేల మాను అంచెల శ్రీవేంకటేశ ఆత్మలో నీవుండఁగాను పొంచి నీ కరుణ నన్నుఁ బొదుగ కేల మాను పె.అ.రేకు: 0032-05 శుద్ధవసంతం సంపుటము: 15-181 పల్లవి: నీకు నీవే వలసితే నీవునన్నుఁ గాచుకొమ్మ నాకు వసగానివెల్ల నన్నుఁ బాసీనయ్య చ. పాపములతోడఁబుట్టె పైకొన్న దేహము పాపము సేయకుమంటే పక్కున నేల మానును కోపమే కూడుగాఁ గడిచినయట్టి బుద్ధి కోపము విడువమంటే గుణమేల మానును చ. అప్పుడేర్పించవచ్చిన యట్టి యీసంసారము అప్పు దీర్చుకోకుమంటే నది యేల మానును తప్ప వేయ వచ్చి నన్ను తగిలె నీ కర్మము తప్పులు వేయక సారె తా మేల మానును చ. పంచమహాపాతక భోగపుటింద్రియములు పంచమహాపాతకపు బారిఁ దోయ కేల మాను అంచ శ్రీవేంకటేశ నీవాతుమలో నుండఁగాను పొంచి నీ కరుణ నన్ను పొదుగ కేల మానును పె.అ.రేకు : 0038-02 గౌళ సంపుటము: 15-214 పల్లవి: నీకు సరి లే రీనిఖిలలోకములలో కాకాసురుని నట్లఁ గాచితివి నీవు చ. హరి పరమపురుషా యచ్చుతానంతా కలివరద మురహరా కరుణానిధీ ధర యూకసము బలి తలయు మూఁ డడుగులను పరగం గైకొన్నయట్టి బలువుఁడవు నీవు చ. మాధవా భూధవా మధుసూదనా కృష్ణ శ్రీధరా శ్రీపతీ శ్రీనివాస శోధించి జలధులు చొచ్చి చదువులు దెచ్చి ఆ ధాత కిచ్చితివి అధికుఁడవు నీవు చ. వామన కేశవ వాసుదేవ ముకుంద రామ గోవింద చక్రకరాంబుజా ఆ మహిమ శ్రీ వేంకటాద్రిమీఁదట నెక్కి కామితఫలముల నిచ్చు ఘనుఁడవు నీవు రేకు:0278-05 సాళంగం సంపుటము: 03-451 పల్లవి: నీకుఁ దొల్లే యలవాటు నిరుహేతుకపుదయ