పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/698

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

696 పల్లవి: నీకంటే నితరము మరి లేదు నేనెవ్వరితో భాషింతు యేకో నారాయణుఁడవు నీవని యెన్నచు నున్నవి వేదములు చ. యొక్కడ చూచిన నీరూపంబులే యెవ్వరిఁజూచినఁ దోఁచిని వెక్కసముగ నీమహిమ యనంతము విశ్వాత్మకుఁడవుగాన నిక్కి యెవ్వరిని బేర్కొని పిలిచిన నీనామములై తోఁచీని వక్కణించఁగా సకలశబ్దములవాచ్యుఁడవటు గాన చ. యేపనిచేసిన నీపనులే అవి యివ్వలనవ్వలఁ దోఁచీని పాపపుణ్యమని తోఁచదు నీవే పరవైతన్యమవటు గాన దాపుగ మతిలోనేమి దలఁచినా ధాన్యము నీదైతోఁచీని లోపల వెలుపల నిండుక వుండెది లోకపూర్జుఁడవు గాన చ. యీ యర్ధమునకు నేననువాఁడను యొక్కడ నున్నాఁడ నీలోనే కాయధారినై యేర్పడి నీలోఁగాక చరించితి యిన్నాళ్లు యీ యపరాధము యెంచకుమీ నను యిందునె పాశీ నీశరణంటి పాయక నిన్నిఁక శ్రీవేంకటపతి పరబ్రహమవుఅటు గాన రేకు:0230-06 మాళవిగౌళ సంపుటము: 03-173 పల్లవి: నీకు నాకు నెట్టుగూడె నీ వెట్టు నన్నేలితివి యీ కరుణకే మొక్కితి నిందిరారమణా చ. కమలాక్ష నీ వనంతకల్యాణగుణనిధివి అమితదురుణరాసి నన్నిటా నేను అమరఁగ స్వతంత్రుఁడ వటు నిన్ను నెంచితేను తమి నించుకంతా స్వతంత్రుఁడ నేఁ గాను చ. దేవ నీవైతే సర్వదేవరక్షకుఁడవు నే జీవుఁడ నింద్రియాలఁ బెంచేవాఁడను ఆవల బ్రహ్మాండాల కన్నిటాఁ బొడవు నీవు భావించ నేనణువై పరగేటివాఁడను చ. నానార్ధసంపన్నుఁడవు నావల్ల నేమి గంటివి ఆనుక నా యంతర్యామివై పాయవు శ్రీనిధివి నీవైతే శ్రీవేంకటాద్రిపతివి దీనుఁడ నొకఁడ నేను బ్రిష్టించి కాచితివి రేకు:0267-05 ముఖారి సంపుటము: 03-387 పల్లవి: నీకు నీ సహజమిది నాకు నా సహజమిది యేకడా నీవే నిరుహేతుక బంధుఁడవు చ. నే నిన్నుఁ దలఁచినా నెఱి నిన్ను మఱచినా పూని నా యంతరాత్మవై వుండకపోవు పూని నిన్నుఁ బూజించినాఁ బూజించకుండినాను కానీలే యీశ్వరుఁడవుఁ గాక మానవు చ. యిట్టె నే నడిగినా నేమీ నడుగకుండినా జట్టిగా నీవు రక్షించక మానవు తొట్టి నిన్ను దగ్గరినా దూరమున నుండినాను పుట్టించి నీ గర్భములోఁ బొదలించకుండవు చ. భావించి నీకు మొక్కినాఁ బరాకై మానినా నేవి చూచినా నీవై యిఁకఁ బాయవు శ్రీవేంకటేశుఁడ నీవే చింతాయకుఁడవు కావించేటి నా వుద్యోగములేమి బాఁతి రేకు:0303-06 దేపాళం సంపుటము:04-018 పల్లవి: నీకు నీవే వలసితే నీవు నన్నుఁ గాచుకొమ్ము